బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, దిశా పటానీ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి బయట తిరగడం, పార్టీలకు వెళ్తుండడం చేసేవారు. తమకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ప్రేమ గురించి లీక్ ఇచ్చుకున్నారు.

అయితే ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం ఎప్పుడూ ధ్రువీకరించలేదు. తామిద్దరం ప్రేమలో ఉన్నట్లుగా ప్రకటించుకోలేదు. అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరికీ బ్రేకప్ జరిగిందని, వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమ గురించి బయటకి చెప్పని ఈ జంట అంతే హడావిడి లేకుండా విడిపోయారని ప్రచారం జరుగుతోంది.

దానికి కారణం.. వీరిద్దరూ జంటగా కలిసి కనిపించాకోవడం, సోషల్ మీడియాలో హడావిడి చేయకపోవడమే.. గతంలో చేసిన హడావిడి ఇప్పుడు చేయకపోవడంతో వీరిద్దరూ విడిపోయారనే ప్రచారం ఊపందుకుంటోంది. ఇదే సమయంలో టైగర్ ష్రాఫ్ గురించి మరో ప్రచారం కూడా సాగుతోంది.

టైగర్ ఇప్పుడు శ్రద్దాకపూర్ తో డేటింగ్ మొదలుపెట్టాడని సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి 'బాఘీ' సినిమాలో నటించారు. అప్పటి పరిచయం ఇప్పుడు ప్రేమగా మారిందనే ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై స్పందించిన శ్రద్ధా.. టైగర్ తనకు ఇష్టమైన వ్యక్తి అని ప్రకటించింది. అయితే ఈ ఇష్టం ప్రేమా..? కాదా..? అనే విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు.