త‌న‌పై వ‌స్తున్న పుకార్ల కు క్లారిటీ ఇచ్చిన శ్ర‌ద్ద క‌పూర్  ఫర్హాన్ అక్తర్ తో సహజీవనం చేయాడంలేద‌ని చెప్పిన అందాల తార‌ త‌న‌పై దుష్ప‌చారం చేయోద్ద‌ని అంటున్న శ్ర‌ద్ద కపూర్ 

ఫర్హాన్- శ్రద్ధాలు ఉంటున్న ఫ్లాట్ వద్దకు వెళ్లి శక్తి కపూర్ హల్ చల్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. మరి ఇంత వరకూ వచ్చిన ఈ వ్యవహారంపై శ్రద్ధ స్పందించిన తీరు ఆసక్తి కరంగా ఉందితన ఎవరితోనూ సహజీవనం చేయడం లేదని ఈమె స్పష్టం చేసింది. తన గురించి జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమని శ్రద్ధ తేల్చేసింది.

 ఈ వ్యవహారం ఆలస్యంగా తన దృష్టికి వచ్చిందని, దీన్ని ఇక ఆపాలనే ఉద్దేశంతో ఇప్పుడు స్పందిస్తున్నట్టుగా శ్రద్ధ వ్యాఖ్యానించింది. తను తన తల్లిదండ్రులతోనే ఉంటున్నాను అని ఈమె స్పష్టం చేసింది.తనను వాళ్లు బాగా చూసుకుంటారని, తన పేరును ప్రేమాయణాల్లో వాడుకోవడం అందరికీ బాగా అలవాటైందని.. శ్రద్ధ మండిపడింది. మరి నిప్పులేనిదే పొగ రాదు అంటారు.

 శ్రద్ధ విషయంలో శక్తికపూర్ ఆందోళన గురించి చాలా చాలా వార్తలే వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలే అని శ్రద్ధ ఒక్కమాటతో తేల్చేసింది!