సాహో సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో తెలియదు గాని సినిమాకు సంబందించిన వార్తలు మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. రోజుకో గాసిప్ తో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రభాస్ క్రేజ్ సంగతి పక్కనపెడితే కథానాయిక శ్రద్దా కపూర్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. 

రీసెంట్ గా పాల్గొన్న ఫొటో షూట్ లో అమ్మడు ఇచ్చిన స్టిల్ మాములుగా లేదు. సినిమా కోసం ప్రమోషన్స్ చేస్తుందో లేక తన పర్సనల్ వర్క్ లో బిజీగా ఉందొ తెలియదు గాని బేబీ ఎలాంటి స్టిల్ ఇచ్చినా అది సాహో స్థాయిని పెంచుతోంది. రీసెంట్ గా శ్రద్దా బ్లాక్ డ్రెస్ లో చాలా ఘాటుగా కనిపించింది. గ్లామర్ డోస్ సాహు సినిమాలో ఎక్కువగానే ఉన్నట్లు ఇటీవల రిలీజైన సాంగ్ తో హింట్ ఇచ్చారు. 

ఇకపోతే శ్రద్దా గ్లామర్ కోసమనే కాకుండా యాక్షన్ సీన్స్ లో కూడా చాలా కష్టపడి నటించింది. ప్రభాస్ తో పాటు ఆమె కూడా రౌడీలకు తనదైన స్కెచ్ లతో ట్రాప్ చేస్తుందట. గన్ ఫైరింగ్ సీన్స్. లలో కూడా బేబీ చేసిన ఫీట్స్ సినిమాలో హైలెట్ గా ఉంటాయని టాక్ వస్తోంది. మరి ఆడియెన్స్ కి శ్రద్దా ఎంతవరకు నచ్చుతుందో చూడాలి.