Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’కు ఏపిలో ఎంత నష్టపోవచ్చు?
తెలుగు రాష్ట్రాల్లో నిన్న పవన్ అభిమానులు హంగామా చేశారు. ఇక మొదటిరోజు కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయని సమాచారం. ‘భీమ్లా నాయక్’ సినిమా చూసి పలువురు స్టార్లు, సెలబ్రిటీలు పవన్, రానాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఏపిలో పరిస్దితులు వేరేగా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా నిన్న శుక్రవారం ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా రిలీజైన పాటలు, ట్రైలర్స్ తో సినిమా మీద హైప్ పెరిగింది. భారీ అంచనాల మధ్య విడుదల అయిన భీమ్లా నాయక్ సినిమా భారీ విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో నిన్న పవన్ అభిమానులు హంగామా చేశారు. ఇక మొదటిరోజు కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయని సమాచారం. ‘భీమ్లా నాయక్’ సినిమా చూసి పలువురు స్టార్లు, సెలబ్రిటీలు పవన్, రానాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఏపిలో పరిస్దితులు వేరేగా ఉన్నాయి.
ప్రస్తుత టికెట్ ధరలు గిట్టుబాటు కావని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ చిత్రాన్ని ప్రదర్శించాల్సిన రాష్ట్రంలోని 15 థియేటర్లను వాటి యాజమాన్యాలు శుక్రవారం మూసేశాయి. మరో అయిదు థియేటర్లలో ఈ చిత్రానికి బదులుగా వేరే సినిమాలు ప్రదర్శించారు. ఇంకో ఏడు థియేటర్లలో మధ్యాహ్నం, సాయంత్రం తర్వాత భీమ్లానాయక్ చిత్రాన్ని వేశారు. టికెట్ ధరలు పెంచకుండా థియేటర్లపై అధికారులు నిఘా పెట్టారు. విశాఖలో భీమ్లానాయక్ పోస్టర్‌పైనా తహసీల్దార్ ఫోన్ నంబర్లు రాయించారు. అభిమానుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు అనుమతించలేదు.
దాంతో ప్రభుత్వ తీరుపై పవన్‌కల్యాణ్ అభిమానులు భగ్గుమన్నారు. తమ అభిమాన హీరో నటించిన భీమ్లానాయక్ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని ఆందోళనలకు దిగారు. సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుచోట్ల నిరసనలు చేపట్టారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానికి కృష్ణా జిల్లా గుడివాడలో పవన్ అభిమానుల నిరసనల సెగ తగిలింది.
అలాగే టిక్కెట్ రేట్లు ప్రభావంతో అనుకున్న స్దాయిలో ఎపిలో కలెక్షన్స్ రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆంధ్రా రైట్స్ యాభై కోట్లకు అమ్మారని, గవర్నమెంట్ స్ట్రిక్టుగా రూల్స్ అమలు చేయటంతో అంతవసూలు కావటం టఫ్ టాస్క్ అంటున్నారు. లోకల్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ దాంతో టెన్షన్ పడుతున్నారు. ఈ నేపధ్యంలో ఇదే రేట్లు ఉంటే ఫుల్ రన్ పూర్తయ్యేసరికి ఇరవై నుంచి ఇరవై కోట్ల దాకా షేర్ తేడా వస్తుందని, అదే లాస్ అవుతారని అంటున్నారు. అదే జరిగితే సినిమాఈ స్దాయిలో హిట్టైనా ఆంధ్రా లోకల్ డిస్ట్రిబ్యూటర్స్,ఎగ్జిబిటర్స్ తేరుకోవటం కష్టమే.