Asianet News Telugu

ప్రముఖ లేడీ సింగర్ కి వేధింపులు... అరెస్ట్ అయిన డైరెక్టర్!

హైదరాబాద్ కి చెందిన 34ఏళ్ల మెడికాయల నవీన్‌కుమార్‌ షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. టాలీవుడ్ లో ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌ ని నవీక్‌కుమార్‌ గతంలో ఇంటర్వ్యూ చేశాడు.

Short film director arrested  for harassing a lady singer ksr
Author
Hyderabad, First Published Jul 17, 2021, 10:26 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రముఖ సింగర్ ని వేధించిన కేసులో  ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ జైలు పాలయ్యాడు. సింగర్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వివరలోకి వెళితే... హైదరాబాద్ కి చెందిన 34ఏళ్ల మెడికాయల నవీన్‌కుమార్‌  షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. టాలీవుడ్ లో  ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌ ని నవీక్‌కుమార్‌ గతంలో ఇంటర్వ్యూ చేశాడు.

ఆమె ఫొటోను లోగోగా ఉంచి ఆమె పేరు మీద ఒక యూట్యాబ్‌ చానెల్‌ ప్రారంభించాడు. తరువాత బాధితురాలి పేరు మీద ఒక చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించాడు. అతను తన వెబ్‌ సిరీస్‌ వీడియోలు, ఆల్బమ్‌ సాంగ్స్, షార్ట్‌ ఫిల్మ్స్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న సింగర్‌ తన అనుమతి లేకుండా చేస్తున్న ఈ పనులు మానుకోవాలని అతడిని కోరింది. అయినా నిందితుడు ఆమె మాటలు పట్టించుకోలేదు. సింగర్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధిన వీడియాలు అప్‌లోడ్‌ చేస్తూ ఆమెను మానసికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని శుక్రవారం నవీన్‌కుమార్‌ అరెస్టు చేసి రిమాండ్‌ తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios