అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్ కి ఇప్పటివరకు సరైన హిట్టు బొమ్మ పడలేదు. 'అఖిల్' సినిమాతో పరిచయమైన ఈ కుర్ర హీరో మొదటి సినిమాతోనే డీలా పడ్డాడు. 'హలో' సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వలేదు. అతడు నటించిన మూడో సినిమా 'మిస్టర్ మజ్ను' ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

దీంతో అఖిల్ ఆలోచనలో పడ్డాడు. తన తదుపరి సినిమా అనౌన్స్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా అనౌన్స్ చేశాడు. ఈ ఇద్దరికీ సినిమా సక్సెస్ అనేది చాలా ముఖ్యం. బొమ్మరిల్లు భాస్కర్ ఎంతో డెడికేషన్ తో సినిమా చేయాలనుకున్నాడు. అయితే ఈ సినిమాకి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.

మొన్నటివరకు హీరోయిన్ దొరకక సినిమా షూటింగ్ వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు హీరోయిన్ గా పూజాహెగ్డేని ఫైనల్ చేసుకున్నారు. అయినా కానీ.. సినిమా షూటింగ్  మాత్రం ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. పూజాహెగ్డే డేట్ లు ఇప్పట్లో దొరికేలా లేవని సమాచారం. కానీ హీరోయిన్ గా ఆమెనే ఫైనల్ చేయాలని అఖిల్ పట్టుబడుతున్నాడు.

దాంతో ఆమెనే ఫిక్స్ చేసి డేట్ లు ఇచ్చేవరకు షూటింగ్ ఆపే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే నెలలో ఓ వారం రోజులు, ఆ తరువాత నవంబర్ లో మరికొన్ని రోజులు  పూజాహెగ్డే కేటాయిస్తా అని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె డేట్స్ కి తగ్గట్లు సినిమా షెడ్యూల్ ప్లాన్ చేసే పని పడింది గీతాఆర్ట్స్ సంస్థ . దీన్ని బట్టి చూస్తుంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమా వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.