సినిమా కథలు, టైటిల్స్ విషయంలో ఎప్పుడూ కాపీ రైట్ వివాదాలు చూస్తూనే ఉన్నాం. చాలా చిత్రాల టైటిల్స్ విషయంలో వివాదాలు చెలరేగాయి.
సినిమా కథలు, టైటిల్స్ విషయంలో ఎప్పుడూ కాపీ రైట్ వివాదాలు చూస్తూనే ఉన్నాం. చాలా చిత్రాల టైటిల్స్ విషయంలో వివాదాలు చెలరేగాయి. ఇక కొన్ని ఐకానిక్, క్లాసిక్ చిత్రాల టైటిల్స్ ని ప్రస్తుత ఫిలిం మేకర్స్ ఉపయోగించుకోవడం చూస్తూనే ఉన్నాం.
ఇక అమితాబ్ బచ్చన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన షోలే చిత్రం ఇప్పటికి ఒక బెంచ్ మార్క్. ఆ చిత్రం ప్రస్తుత ఫిలిం మేకర్స్ కి లెర్నింగ్ స్కూల్ లాంటిది. షోలే టైటిల్ ని అటు సినిమాల్లో ఇటు బయట వ్యాపారాల్లో పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోవడం చూస్తూనే ఉన్నాం.
ఈ చిత్ర టైటిల్ విషయంలో ఢిల్లీ హై కోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. షోలే లాంటి చిత్రాల టైటిల్స్ ని ట్రేడ్ మార్క్ లా ప్రకారం రక్షించాల్సిన అవసరం ఉంది అని పేర్కొంది. షోలే లాంటి చిత్రాలు చాలా సింపుల్ పదాన్ని టైటిల్ గా ఉపయోగించుకుని చరిత్రలో నిలిచిపోయాయి.
ఇలాంటి పాపులర్ చిత్రాల టైటిల్స్ ని బిజినెస్ కోసం ఎక్కడ ఉపయోగించుకోకూడదు. షోలే మీడియా అండ్ ఎటెర్టైన్మెంట్స్ సంస్థ వేసిన పిటిషన్ ప్రకారం ఢిల్లీ హై కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.
షోలే చిత్రం 1975 ఆగష్టు 15న విడుదలై చరిత్ర సృష్టించింది. ఆ చిత్రంలో పాత్రలో , డైలాగులు, సాధించిన వసూళ్లు ఎప్పటికి చరిత్రగానే మిగిలిపోతాయి. అలాంటి చిత్రం తప్పకుండా ట్రేడ్ మార్క్ లా కిందికి వస్తుందని ఢిల్లీ హై కోర్టు పేర్కొంది. షోలే సింబల్స్ ని ఉపయోగించడం కానీ, ఆ టైటిల్ ని వాడడం కానీ చేయకూడదని పేర్కొన్నారు. అలా చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు.
