Asianet News TeluguAsianet News Telugu

Oscar2023: ట్రోల్స్ కి గురవుతున్న ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా.. `ఆర్‌ఆర్‌ఆర్‌`ని ఎంపిక చేయకపోవడంపై రచ్చ..

ఫారెన్‌ లాంగ్వేజ్‌ విభాగంలో ఆస్కార్‌కి `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాన్ని కాకుండా మరో సినిమాని ఎంపిక చేయడం పట్ల ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

shocking trolls on film federation of india because not selected rrr movie for oscar
Author
First Published Jan 25, 2023, 2:21 PM IST

ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎఫ్‌ఐ)(Fil Federation of Indai) ఇప్పుడు ట్రోల్స్ కి గురవుతుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌`ని ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్‌(ఫారెన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్ విభాగంలో)కి పంపకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆస్కార్‌ కమిటీ నామినేషన్లని ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ నామినేషన్లని ఫైనల్‌ చేశారు. ఇందులో `ఆర్‌ఆర్‌ఆర్‌` (RRR) చిత్రం నుంచి ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో `నాటు నాటు` సాంగ్‌ ఆస్కార్‌కి నామినేట్‌ అయ్యింది. కానీ ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(FFI) పంపిన `చెల్లో షో` చిత్రం నామినేట్‌ కాలేదు. అసలు దానిపై ఎలాంటి బజ్‌ కూడా లేదు. 

అయితే `ఆర్‌ఆర్‌ఆర్‌` ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నామినేట్‌ కావడంతో బెస్ట్ ఫారెన్‌ లాంగ్వేజ్‌ మూవీ విభాగంలోనూ `ఆర్‌ఆర్‌ఆర్‌` ఆస్కార్‌కి నామినేట్‌ అయ్యి ఉండేదనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇండియన్‌ సినీ ప్రియులు. అది గోల్డెన్‌ ఛాన్స్ ని `ఎఫ్‌ఎఫ్‌ఐ` మిస్‌ చేసిందని అంటున్నారు. దీంతో ఫెడరేషన్‌, సినిమాని ఎంపిక చేసిన కమిటీపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. ట్రోల్స్ తో ఆడుకుంటున్నారు. కుళ్లిపోయిన మనస్తత్వాలు, పాత బడిన ఆలోచనలు కలిగిన వారిని ఫెడరేషన్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కమిటీని ప్రక్షాళణ చేయాలంటున్నారు.

అంతేకాదు `ఆర్‌ఆర్‌ఆర్‌`వంటి గొప్ప చిత్రాన్ని వదిలేసి అనామక `చెల్లో షో` మూవీని ఎంపిక చేయడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీనికి ఫెడరేషన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆణిముత్యాన్ని వదిలేసి తూరుపు ముక్కని పట్టుకున్నారే అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. అసమర్థ కమిటీ కారణంగా ఓ మంచి చిత్రాన్ని ఇక్కడే చంపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మీ పేలవమైన ఎంపికలతో భారతీయ సినిమాకి చేసిందేం లేదు, అనర్హమైన సినిమాని పంపడం ద్వారా ఉత్తమమైన చిత్రాలను కిల్‌ చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు నెటిజన్లు. సోషల్‌ మీడియాలో వేదికగా ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాని తక్కువ చేసి, ఆస్కార్ కి ఎప్పటికీ నామినేట్‌ కాలేదని పేర్కొన్నందుకు ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సిగ్గుపడాలని అంటున్నారు. `ఎఫ్‌ఎఫ్‌ఐ` అసమర్థత వల్ల గొప్ప అవకాశం కోల్పోవాల్సి వచ్చిందని విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇండియన్‌ ఫిల్‌ ఫెడరేషన్స్ ట్రోల్స్ కి గురవుతుంది. వార్తల్లో నిలుస్తూ అసలు `ఎఫ్‌ఎఫ్‌ఐ` లోని ఆస్కార్ ఎంపికకి సంబంధించిన కమిటీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చేస్తుంది. 2023కి సంబంధించిన ఆస్కార్‌ అవార్డులకు సంబంధించిన నామినేషన్లలో `నాటు నాటు`తోపాటు రెండు డాక్యుమెంటరీ ఫిల్మ్స్ `ఆల్‌ దట్‌ బ్రీత్స్`, `ది ఎలిఫెంట్‌ విస్పరర్స్` సైతం డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగాల్లో నామినేషన్లని దక్కించుకుని చరిత్ర సృష్టించాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios