మహేష్ 'గుంటూరు కారం'పై షాకింగ్ రూమర్.. గురూజీ వల్ల కోట్లల్లో నష్టం?
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'గుంటూరు కారం'. అతడు, ఖలేజా తర్వాత మహేష్, తివిక్రమ్ లకి ఇది హ్యాట్రిక్ మూవీ.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'గుంటూరు కారం'. అతడు, ఖలేజా తర్వాత మహేష్, తివిక్రమ్ లకి ఇది హ్యాట్రిక్ మూవీ. హ్యాట్రిక్ కాంబినేషన్ కాబట్టి ఒకరేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి.
వాయిదాల పద్ధతి అన్నట్లుగా షూటింగ్ సాగుతోంది. బిగినింగ్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించగా అది మహేష్ కి నచ్చకపోవడంతో మళ్ళీ రీషూట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని షెడ్యూల్స్ పూర్తయ్యాక పూజా హెగ్డే ఈ చిత్రం నుంచి తప్పుకుంది. దీనితో అప్పటి వరకు ఆమె తో చిత్రికరించిన షెడ్యూల్ మొత్తం వేస్ట్ అయిపోయింది.
దీనితో పూజా హెగ్డే స్థానంలో అప్పటి వరకు సెకండ్ హీరోయిన్ గా ఉన్న శ్రీలీలని మెయిన్ హీరోయిన్ గా మార్చారు. సెకండ్ హీరోయిన్ కోసం మీనాక్షి చౌదరిని ఎంపిక చేసుకున్నారు. దీనితో ఈ చిత్రాన్ని మరోసారి రీషూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని టాక్. ఇప్పటికే నిర్మాతలు యాక్షన్ సీన్స్ రీషూట్ కోసం కొన్ని కోట్లు ఖర్చు చేశారట.
ఇప్పుడు మరోసారి రీషూట్ అంటే మరో 10 కోట్ల అదనపు భారం నిర్మాతల పైన పడుతోందని అంటున్నారు. రిలీజ్ కి ముందే నిర్మాతలకు గుంటూరు కారం చిత్రం 10 కోట్లపైనే నష్టం మిగిల్చినట్లు తెలుస్తోంది. ఇలా వరుసగా రీషూట్స్ జరుగుతూ ఉంటే ఫ్యాన్స్ కి కూడా ఈ చిత్రం పై ఆసక్తి పోతుంది. ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది గురుజీనే కాబట్టి అందరూ ఆయన్నే ట్రోల్ చేస్తున్నారు. మరి త్రివిక్రమ్ ఏం చేస్తారో చూడాలి.