కృతి శెట్టికి నాగ చైతన్య చిత్రంలో మరోసారి నటించే ఛాన్స్ దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. జరుగుతున్న ప్రచారం ప్రకారం నాగ చైతన్య కోసం కృతి శెట్టి ఒక సాహసోపేతమైన పాత్రలో నటించేందుకు ఓకె చెప్పినట్లు తెలుస్తోంది.
డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి అద్భుతమైన విజయం సాధించింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. కృతి శెట్టి ఒక్కసారిగా టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. కానీ ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది.
వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. వీటిలో బంగార్రాజు మాత్రమే విజయం సాధించింది. మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. మాచర్ల నియోజకవర్గం కూడా డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో ఒకటి రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయి.
అయితే కృతి శెట్టికి నాగ చైతన్య చిత్రంలో మరోసారి నటించే ఛాన్స్ దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. జరుగుతున్న ప్రచారం ప్రకారం నాగ చైతన్య కోసం కృతి శెట్టి ఒక సాహసోపేతమైన పాత్రలో నటించేందుకు ఓకె చెప్పినట్లు తెలుస్తోంది.
త్వరలో నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో కృతి శెట్టి ప్రేతాత్మగా హర్రర్ రోల్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్యూట్ గా అందంగా కనిపించే బేబమ్మ ఇలా హర్రర్ రోల్ లో కనిపించడం ఏంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు.
మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే కృతి శెట్టి స్వయంగా క్లారిటీ ఇవ్వాలి. బంగార్రాజులో నాగ చైతన్య, కృతి జంటకు మంచి మార్కులు పడ్డాయి.
