అక్కినేని వారసుడు అఖిల్ తన కెరీర్ ని మలుపు తిప్పే మంచి యాక్షన్ మూవీ కోసం ఎదురుచూస్తున్నాడు. బహుశా ఆ చిత్రం 'ఏజెంట్' మూవీనే కావచ్చు. అఖిల్ నటించిన తొలి మూవీ 'అఖిల్' కూడా యాక్షన్ మూవీనే.

అక్కినేని వారసుడు అఖిల్ తన కెరీర్ ని మలుపు తిప్పే మంచి యాక్షన్ మూవీ కోసం ఎదురుచూస్తున్నాడు. బహుశా ఆ చిత్రం 'ఏజెంట్' మూవీనే కావచ్చు. అఖిల్ నటించిన తొలి మూవీ 'అఖిల్' కూడా యాక్షన్ మూవీనే. కానీ అది డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా నిరాశ పరిచాయి. 

అఖిల్ చివరగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం పర్వాలేదనిపించింది. కానీ అది సరిపోదు. మాస్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కి ఒక సాలిడ్ మూవీ.. దానిని డైరెక్ట్ చేసే నిఖార్సైన దర్శకుడు కావాలి. ఆ రకంగా 'ఏజెంట్' చిత్రానికి అన్నీ కుదిరాయి అనే చెప్పొచ్చు. అయితే రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఈ చిత్రానికి కష్టాలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే ఏజెంట్ చిత్రం పలుమార్లు రిలీజ్ వాయిదా పడింది. ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చివరగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు రిలీజ్ కి నెల సమయం కూడా లేదు. కానీ ఏజెంట్ విడుదల దిశగా అడుగులు పడుతున్నట్లు ఎలాంటి సందడి లేదు. దీనితోఏజెంట్ 28న వస్తాడా రాడా అనే సందేహం నెలకొంది. 

సాధారణంగా అయితే ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాలి. కానీ చిత్ర యూనిట్ అసలు ఆ మూడ్ లోనే లేనట్లు అనిపిస్తోంది. దీనితో తెరపైకి కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాత సుంకర రామబ్రహ్మం మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. 

నిర్మాత ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చూస్తుంటే.. సురేందర్ రెడ్డి మాత్రం ఇంకాస్త టైం కావాలని అడుగుతున్నారట. దీనితో ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. ఇది అక్కినేని అభిమానులని కలవర పెడుతోంది. మరి ఏజెంట్ టీం ఇకనైనా అలెర్ట్ అయి రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.