ప్రభాస్ సాహో ఆగస్ట్ 15న వస్తుందని ...అంతకు ముందు వారం (ఆగస్టు 9న) రిలీజ్ అయ్యే ‘మ‌న్మ‌థుడు 2’కు దెబ్బ తగులుతుందని ట్రేడ్ లో ప్రచారం జరిగింది. దాంతో రిలీజ్ డేట్ ఛేంజ్ చేయమని నాగార్జునని కోరారు. అయితే నాగ్ తను అనుకున్న డేట్ కే వస్తానని చెప్పారు. దాంతో ‘మ‌న్మ‌థుడు 2’బిజినెస్ పై దాని ఇంపాక్ట్ కనపడింది. అయితే ఊహించని విధంగా సాహో సైడ్ అయ్యింది. రిలీజ్ వాయిదా పడింది.

దాంతో ఇప్పుడు మన్మధుడు 2 కు క్రేజ్ వచ్చిందని సమాచారం. నాగార్జున, దర్శకుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం మ‌న్మ‌థుడు 2. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, స‌మంత అతిధి పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ నేపధ్యంలో బిజినెస్ ఊపందుకుంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం నాన్ థియోటర్ రైట్స్ 22 కోట్లు దాకా పలికాయని సమాచారం. ఇందులో తెలుగు,హిందీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి ఉన్నాయి. మరో ప్రక్క ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని కోటిన్నరకు కోట్ చేసారు. సాహో దెబ్బకు భయపడి ఆగిన డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు ఉత్సాహంగా ఆ రేటు ఇవ్వటానికి ముందుకు వస్తున్నట్లు సామాచారం.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటున్న ఈ చిత్రం   అలాగే చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆడియో విడుద‌ల‌ను త్వ‌ర‌లోనే నిర్వ‌హించ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగార్జున స్వయంగా జెమిని కిర‌ణ్‌‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆర్‌ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ప‌ని చేస్తున్నారు. ఫ‌న్ రైడ్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్‌9న విడుద‌ల చేయ‌నున్నారు.