Asianet News TeluguAsianet News Telugu

భోళా శంకర్... చెల్లి పాత్రకు అన్ని కోట్లా?... ఇదో సరికొత్త రికార్డు!

సూపర్ ఫార్మ్ లో ఉండి కూడా చెల్లి పాత్రలు చేస్తుంది కీర్తి సురేష్. చిరు లేటెస్ట్ మూవీ భోళా శంకర్ మూవీలో ఆమె హీరో చెల్లిగా కనిపించనున్నారు. అయితే రెమ్యూనరేషన్ మాత్రం హీరోయిన్ రేంజ్ లో తీసుకున్నారట.

shocking remuneration for keerthy suresh for chiranjeevi bhola shankar
Author
Hyderabad, First Published Nov 11, 2021, 3:27 PM IST

వరుస ఆఫర్స్ తో ఫార్మ్ లో ఉన్న హీరోయిన్స్ చెల్లి పాత్రలు చేయడానికి అసలు ఇష్టపడరు. అది తమ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తారు. వాస్తవంలో కూడా చెల్లి పాత్రలు చేసే హీరోయిన్స్ ని స్టార్స్ తమకు జోడీగా తీసుకోవడానికి ఇష్టపడరు. ఈ సెంటిమెంట్ ని పక్కన పెట్టి, పాత్రలో విషయం ఉంది అనుకుంటే చేసేస్తుంది హీరోయిన్ కీర్తి సురేష్. రజినీకాంత్ (Rajinikanth) హీరోగా దీపావళి కానుకగా విడుదలైన అన్నాత్తే చిత్రంలో ఆమె హీరో చెల్లి పాత్ర చేశారు. కథలో కీలకమైన ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. 
 

భోళా శంకర్ (Bhola shankar) మూవీలో మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా కీర్తి కనిపించనున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ అని సమాచారం. ఈ మూవీలో హీరో చెల్లి పాత్ర కీలకం కాగా, కీర్తి సురేష్ ని ఎంచుకున్నారు. మొదట సాయి పల్లవికి ఈ ఆఫర్ వచ్చింది, అయితే ఆమె ఈ ఆఫర్ ని తిరస్కరించడం జరిగింది. 


దీనితో కీర్తి సురేష్(Keerthy suresh) ని సంప్రదించగా.. ఆమె ఓకే చేశారు. అయితే ఆమె మార్కెట్, డిమాండ్ రీత్యా, చెల్లి పాత్ర అయినప్పటికీ రెమ్యూనరేషన్ మాత్రం హీరోయిన్ రేంజ్ లో తీసుకుంటున్నారట. టాలీవుడ్ లో నడుస్తున్న టాక్ ప్రకారం, భోళా శంకర్ చిత్రానికి గాను రూ. 2 కోట్లు కీర్తి రెమ్యూనరేషన్ లో తీసుకుంటున్నారట. మరి ఇదే నిజం అయితే... బహుశా దేశంలోనే మరే నటి చెల్లి పాత్ర కోసం ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకొని ఉండరు. 

Also read Chiranjeevi: భోళా శంకర్ కి శ్రీకారం చుట్టిన చిరు!
కాగా  నేడు భోళా శంకర్ మూవీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ వేదికగా నిర్వ్హయించిన ఈ వేడుక ఘనంగా జరిగింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ హాజరు కాగా, అట్టహాసంగా నిర్వహించారు. సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు, డైరెక్టర్ బాబీ, వివి వినాయక్, హరీష్ శంకర్ ,కొరటాల శివ, గోపీచంద్ మలినేని, హాజరయ్యారు. అలాగే చిత్ర నిర్మాతలుగా ఉన్న అనిల్ సుంకర, కే ఎస్ రామారావు పాల్గొన్నారు. భోళా శంకర్ చిత్రంలో చిరు (Chiranjeevi)కు జంటగా తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన జరుగగా, నేడు ఆమె కూడా పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. త్వరలో భోళా శంకర్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వెల్లడించారు. 

Also read Tamannah bhatia: చిరు జంటగా తమన్నా... మరో భారీ ఆఫర్ పట్టేసిన మిల్కీ బ్యూటీ

Follow Us:
Download App:
  • android
  • ios