సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ ఎప్పుడు ఒకేలా ఉండదని అందరికి తెలిసిన విషయమే. సక్సెస్ లేనప్పుడు ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. అయితే వాతావరణం ఎలా ఉన్నా కూడా ఎప్పుడు ఒకేలా కనిపించే మాస్ రాజాకు మరో షాకింగ్ న్యూస్ అంటూ కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. 

ప్రస్తుతం రవితేజ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. సైన్స్ ఫిక్షన్ తరహాలో తెరకెక్కనున్న ఆ ప్రయోగాత్మక చిత్రాన్ని ఎస్ఆర్ టి ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నారు. అయితే సినిమా బడ్జెట్ మొదట అనుకున్నంత భారీ స్థాయిలో ఖర్చు చేయడం కుదరదని నిర్మాత దర్శకుడికి చెప్పినట్లు టాక్ వస్తోంది.; 

ఈ ఏడాది టచ్ చేసి చూడు - నెల టిక్కెట్టు అలాగే రీసెంట్ గా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాల ఫెయిల్యూర్స్ రవితేజ మార్కెట్ ను చాలా దెబ్బకొట్టాయి. దీంతో రిస్క్ చేయడం కష్టమని బడ్జెట్ లెక్కలను ఎడిటి చేయాలనీ చర్చలు జరిపినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇస్తే బావుంటుంది.