అలీ రెజా కుటుంబంలో విషాదం.. చెప్పకుండా దాచిపెట్టిన ఫ్యామిలీ!
నటుడిగా, మోడల్ గా అలీ రెజా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. బిగ్ బాస్ షో అలీ రెజాకు మరింత పాపులారిటీ లభించింది. అలీ రెజా బిగ్ బాస్ హౌస్ లో 50 రోజుల పాటు కొనసాగాడు.
గత ఆదివారం బిగ్ బాస్ 3 ఎపిసోడ్ లో భాగంగా అలీ రెజా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అలీ రెజా ఎలిమినేట్ కావడం ఇంటి సభ్యులతో పాటు, ఆడియన్స్ కు కూడా పెద్ద షాక్ అని చెప్పాలి. ఈ సీజన్ బలమైన కటెస్టెంట్ గా అలీ రెజాని ప్రేక్షకులు భావించారు.
అలీ రెజా తప్పకుండా టైటిల్ బరిలో నిలిచే సభ్యుడు అని, చివరి ఐదుగురిలో ఒకరిగా ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యాడు. ఇంటి సభ్యులంతా కన్నీటిపర్యంతమవుతూ అలీకి హౌస్ నుంచి వీడ్కోలు పలికారు. వీరందరి అభిమానం చూస్తుంటే తనకు టైటిల్ గెలిచినంత సంతోషంగా ఉందని అలీ నాగార్జునతో చెప్పిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా అలీ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక ఇంటికి వెళ్ళగానే తనకు పిడుగులాంటి బ్యాడ్ న్యూస్ ఎదురైందని తెలిపాడు. తాను బిగ్ బాస్ లో పాల్గొంటున్న సమయంలోనే తన మావయ్య చనిపోయాడని ఇంటికి వెళ్ళాక తెలిసిందని అలీ రెజా భావోద్వేగానికి గురయ్యాడు.
నా కుటుంబ సభ్యులు బిగ్ బాస్ షో తన కెరీర్ కు చాలా కీలకం అని భావించారు. నేను గేమ్ పై ఫోకస్ చేయడానికి ఈ వార్తని నాకు చెప్పలేదు. ఈ వార్త నాకు తెలిస్తే నేను బిగ్ బాస్ హౌస్ లో గేమ్ పై ఫోకస్ చేయలేనని మా తల్లిదండ్రులకు తెలుసు. అదే సమయంలో నా ఫ్యామిలీ కూడా నాకు చాలా ముఖ్యం. నేను కెరీర్ లో సక్సెస్ సాధించాలి, ఇంకా ఎదగాలని కోరుకునే వారిలో మా మావయ్య ఒకరు.
ఎలిమినట్ అయి షాక్ లో ఇంటికి వెళ్లిన నాకు ఈ వార్త మరింత బాధ కలిగించింది. ఇంతటి బాధలో కూడా నా ఫ్యామిలీ నన్ను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించిందని అలీ రెజా తెలిపాడు. నీ చివరి చూపుకు నోచుకోలేకపోయినందుకు జీవితాంతం బాధపడుతూనే ఉంటా.. లవ్ యు ఫరెవర్ మావయ్య అని అలీ రెజా తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు.
ఈ పోస్ట్ పై అలీ రెజా అభిమానులు స్పందిస్తూ.. తన మావయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.
బిగ్ బాస్ 3: ఆపండెహే ఇది సంతాప సభ కాదు.. జ్యోతి, రవిలపై శ్రీముఖి ఫైర్!
బిగ్ బాస్3: అలీ రెజాకు మరో ఛాన్స్? నిజమేనా!