త్రివిక్రమ్ సినిమాకు మహేష్ కు షాకింగ్ రెమ్యునరేషన్
అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ ఈ చిత్రం కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ దాదాపు 55 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ కింద మహేష్ కు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
మహేష్ తన నెక్ట్ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ కాంబో పై రకరకాల వార్తలు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకాలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ స్క్రిప్టు కు మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. ఈ నేపద్యంలో ఈ చిత్రానికి మహేష్ ఎంత రెమ్యునేషన్ తీసుకుంటున్నారనే విషయమై చర్చ జరుగుతోంది.
అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ ఈ చిత్రం కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ దాదాపు 55 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ కింద మహేష్ కు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న చిత్రానికి ఇప్పటికే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలు దర్శనమిస్తున్నాయి. చిత్ర టీమ్ నుంచి ఈ టైటిల్‌పై ఎటువంటి ప్రకటన రాలేదు కానీ.. మీడియాలో మాత్రం ఈ చిత్రానికి ‘పార్థు’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లుగా వార్తలు మొదలయ్యాయి.
‘పార్థు’.. అనగానే ఈ టైటిల్ ఎక్కడో విన్నట్లు ఉంది కదా. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రం ‘అతడు’లో మహేష్ పేరు అదే. ఇప్పుడదే పేరుని ఈ సినిమా టైటిల్‌గా త్రివిక్రమ్ ఫైనల్ చేసినట్లుగా చెప్తున్నారు. ఇది ఊహించి మీడియాలో వదిలిన వార్తో, లేక నిజమో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.
ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చాయి. దాదాపు 11ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా ఖరారవటంతో అంతటా ఆసక్తి నెలకొంది. దీంతో మహేశ్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ఇక ‘సరిలేరు నీకెవ్వరూ’తో మహేశ్‌బాబు, ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఇచ్చిన సక్సెస్ తో త్రివిక్రమ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నారు. వచ్చే వేసవికి ఈ సినిమా విడుదల కానుంది. హీరోయిన్, నటీనటుల గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
మహేశ్‌బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారిపాట’లో బిజీగా ఉన్నారు. కరోనా వల్ల ఆ షూటింగ్ వాయిదా పడింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్ర టీమ్ ప్రకటించింది. మరోవైపు త్రివిక్రమ్ పవన్‌కల్యాణ్, రానా కలయికలో మల్టీస్టారర్‌గా వస్తున్న చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఎన్టీఆర్‌తోనూ ఒక సినిమా చేసే అవకాసం ఉన్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.