Asianet News TeluguAsianet News Telugu

`గేమ్‌ ఛేంజర్‌` ఒక్క పాట సెట్‌ కోసం అన్ని కోట్లా?.. ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔటే?

`గేమ్‌ ఛేంజర్‌` నుంచి తొలి పాట రాబోతుంది. `జరగండి జరగండి` అంటూ ఈ పాట సాగుతుందట. ఈ పాటని దీపావళికి విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ని పంచుకున్నారు. 

shocking expenses for game changer song if you know budget fuses out ? arj
Author
First Published Oct 26, 2023, 6:11 PM IST

దర్శకుడు శంకర్‌ గ్రాండియర్‌కి కేరాఫ్‌. ఆయన రూపొందించే ఈ సినిమా అయినా చాలా లావిష్‌గా ఉండాలనుకుంటారు. అలానే తీస్తారు. అందుకే ఆయన సినిమాలకు వందల కోట్లు బడ్జెట్‌ అవుతుంటుంది. ఇప్పుడు రామ్‌చరణ్‌ తో `గేమ్‌ ఛేంజర్‌`ని రూపొందిస్తున్నారు దర్శకుడు శంకర్‌. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

దిల్‌రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సుమారు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. మొదట రెండు వందల కోట్ల బడ్జెట్‌ అనుకున్నారు. కానీ ఇప్పుడు మూడు వందల కోట్లు దాటుతుందని సమాచారం. అయితే తాజాగా ఓ క్రేజీ వార్త సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. ఒక్క పాట కోసం శంకర్‌ పెట్టిన ఖర్చు షాకిస్తుంది. ఫ్యూజుల్‌ ఔట్‌ అయ్యేలా చేస్తుంది. 

`గేమ్‌ ఛేంజర్‌` నుంచి తొలి పాట రాబోతుంది. `జరగండి జరగండి` అంటూ ఈ పాట సాగుతుందట. ఈ పాటని దీపావళికి విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ని పంచుకున్నారు. కలర్‌ ఫుల్‌గా ఈ పోస్టర్‌ ఉంది. ఇందులో రామచరణ్‌ బ్లూ కలర్‌ డ్రెస్‌లో కనిపిస్తున్నారు. పేక మేడలను తలపించేలా ఇళ్లున్నాయి. ఆ ఇంటి వద్ద గిరిజన మహిళలున్నారు. చూడ్డానికి ఫుల్‌ కలర్‌ ఫుల్‌గా ఉంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

చూడ్డానికి ఎక్కడో రియల్‌ లొకేషన్ల లా ఉంది. కానీ ఇదంతా ఓ సెట్‌ అని సమాచారం. దీనికోసం భారీగానే ఖర్చు చేశారట. ఏకంగా 16కోట్లు ఈ సాంగ్‌ సెట్‌ కోసమే ఖర్చయ్యిందని సమాచారం. ఇది సెట్‌లా కాకుండా ఒరిజినల్‌ లొకేషన్ ని తలపించేలా కనిపిస్తుందని సమాచారం. సినిమాలో చూసినప్పుడు అదొక వండర్‌లా ఉంటుందని తెలుస్తుంది. మరి ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. రామ్‌చరణ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారట. ఇక ఇందులో చరణ్‌కి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్‌, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్‌లోగానీ, ద్వితీయార్థంలోగానీ రిలీజ్‌ చేసే అవకాశం ఉంది.   
 

Follow Us:
Download App:
  • android
  • ios