మహానటి సినిమాతో ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని మంచి క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం ఆడియెన్స్ కి కొత్త లుక్ తో షాకిస్తుంది. మొన్నటి వరకు న్యాచురల్ లుక్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు బక్కచిక్కినట్లు  కనిపించడంతో అభిమానులకి అంతగా నచ్చడం లేదు. 

వరుస అవకాశాలు అందుకుంటున్న కీర్తి సురేష్ పాత్రల కోసం ఇప్పటివరకు ఫిట్ నెస్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ మొదటిసారి అమ్మడు కారణం చెప్పకుండా సన్నబడింది. ఏదైనా పాత్ర కోసం ఇలా మారిందా లేక సైజ్ జీరో మెయింటైన్ చేస్తే ఆఫర్స్ వస్తాయని అనుకుందా?. కారణం ఏమిటో గాని ఫ్యాన్స్ మాత్రం కీర్తి సన్నబడటం అస్సలు ఒప్పుకోవడం లేదు. 

కాస్త తినవమ్మా అంటూ సెటైర్ వేస్తున్నారు. ప్రస్తుతం కీర్తి ఒక లేడి ఓరియెంటెడ్ సినిమాతో బిజీగా ఉంది. నరేంద్ర నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.