అనుపమకి హీరోతో లింక్.. అంతా మేనేజర్ నిర్వాహకం!

First Published 19, Jun 2018, 11:34 AM IST
Shocking Behaviour Of heroine anupama's manager
Highlights

హీరోయిన్లకు మేనేజర్ గా పని చేసే వారు వాళ్ల కాల్షీట్స్, డేట్స్,రెమ్యునరేషన్ వంటి విషయాలు 

హీరోయిన్లకు మేనేజర్ గా పని చేసే వారు వాళ్ల కాల్షీట్స్, డేట్స్,రెమ్యునరేషన్ వంటి విషయాలు చూసుకుంటుంటారు. స్క్రిప్ట్ విషయంలో కూడా వారి ఇన్వాల్వ్మెంట్ కాస్తో కూస్తో ఉంటుంది. అయితే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ దగ్గర పని చేసిన వ్యక్తి మాత్రం ఆమె వ్యక్తిగత విషయాల్లో కలగజేసుకోవడం, షూటింగ్ సమయాల్లో అతిగా ప్రవర్తిస్తుండడంతో అతడిని మేనేజర్ పోస్ట్ నుండి తప్పించింది.

దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న సదరు మేనేజర్ అనుపమపై కావాలని రూమర్లు స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టాడని తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం కలిసి సినిమా చేస్తోన్న హీరోతో అనుపమకు లింక్ ఉందంటూ గాసిప్పులు పుట్టించాడు. దాదాపు అన్ని మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా రాసుకొచ్చాయి. మేనేజర్ వ్యవహారంతో విసిగిపోయిన అనుపమ ఈ విధంగా చేస్తుండడం బాధను కలిగిస్తుందని సన్నిహితుల వద్ద వాపోయిందట.

గతంలో ఇదే వ్యక్తి కేథరిన్ త్రెసా వద్ద కూడా పని చేశాడు. ఆమె కూడా కొన్ని కారణాలతో అతడిని మేనేజర్ పదవి నుండి తొలగించింది. మొత్తానికి హీరోయిన్లకు మేనేజర్ల నుండి కూడా తిప్పలు తప్పడం లేదన్నమాట! 

loader