కన్నడ యంగ్ హీరో చిరంజీవి సర్జ హఠాన్మరణంతో సాండల్‌వుడ్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు అర్థాంతరంగా తనువు చాలించటంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ సినీ ప్రముఖులతో పాటు ఇతర రంగాల వారు కూడా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నావెలిస్ట్‌ శోభా డే ఓ పొరపాటు చేసింది.

చిరంజీవి సర్జకు నివాళులర్పిస్తూ చేసిన ట్వీట్‌తో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ఫోటోను పోస్ట్ చేశాడు నెటిజెన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే తెరుకున్న శోభా ఆ ట్వీట్‌ను డిలీట్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పలువురు నెటిజెన్లు శోభా ట్వీట్‌ను స్క్రీన్‌ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో శోభాపై విమర్శలు వినిపిస్తున్నాయి. బాధ్యతగా ప్రవర్తించాల్సిన వారే ఇలాంటి చేయటం ఏంటి అంటూ విమర్శిస్తున్నారు నెటిజెన్లు.

మెగాస్టార్ చిరంజీవి ఫోటోను పోస్ట్ చేసిన శోభా డే, `మరో ధృవతార రాలిపోయింది. విషాదకరమైన నష్టం. వారి కుటుంబానికి నా ప్రగాఘ సానుభూతి` అంటూ చిరంజీవి సర్జ ట్విటర్‌ అకౌంట్‌ ను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేసింది. అయితే ఫోటో విషయంలో మాత్రం పొరపాటు చేసింది. దీంతో శోభా డేపై మెగాస్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.