బిగ్‌ బాస్‌ తెలుగు 7 గ్రాండ్‌ ఫినాలే రోజు పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్ చేసిన హంగామా, కార్లపై దాడి చేసిన ఘటనపై తాజాగా శోభా శెట్టి రియాక్ట్ అయ్యింది. మొదటి సారి ఆమె దీనిపై నోరు విప్పించింది. 

బిగ్‌ బాస్‌ 7 తెలుగు సీజన్‌ పూర్తయ్యింది. ఈ సారి అత్యధిక రేటింగ్‌ని సాధించింది. దీంతో బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఫుల్‌ ఖుషి. కానీ ఫినాలే రోజు జరిగిన సంఘటనే ఇప్పుడు అందరిని కలవర పెడుతుంది. బిగ్‌ బాస్‌ విన్నర్‌గా నిలిచిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కి సంతోషం లేకుండా చేసింది. గెలిచిన హ్యాపీనెస్‌ని సెలబ్రేట్‌ చేసుకునే పరిస్థితి లేకుండా అయ్యింది. ఏకంగా జైలుకి వెళ్లి రావాల్సి వచ్చింది. ఆ సమయంలో అమర్‌ దీప్‌, అశ్వినీ, గీతూ రాయల్‌తోపాటు చాలా మంది కంటెస్టెంట్ల కార్ల అద్దాలను ధ్వంసం చేశారు పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్. దీంతో పెద్ద రచ్చ అయ్యింది. 

అయితే తాజాగా దీనిపై శోభా శెట్టి మొదటి సారి రియాక్ట్ అయ్యింది. సీరియల్‌లో మోనికాగా పాపులర్‌ అయిన శోభాశెట్టి బిగ్‌ బాస్‌హౌజ్‌లోనూ ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అదే రేంజ్‌లో తన ఆటని ఆడి చూపించింది. 14వ వారంలో ఆమె బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది. అయితే ఘటన రోజు తన కారు అద్దాలు కూడా ధ్వంసం అయినట్టు వార్తలు వచ్చాయి. యూట్యూబ్‌లో వీడియోలు పెట్టారు. ఈ ఘటనపై మొదటిసారి శోభా శెట్టి మాట్లాడింది. ఆ ఘటన జరగడం బాధాకరమని తెలిపింది. హౌజ్‌లో జరిగింది, కేవలం దానికే పరిమితమని, బయట తాము అంతా బాగానే ఉంటామని తెలిపింది. 

అయితే వేరే వాళ్ల కారు బ్రేక్‌ అయ్యిందని, కానీ తన కారుగా దాన్ని ప్రసారం చేశారని, సోషల్‌ మీడియాలో వీడియోలు పెట్టడం వల్ల బెంగుళూరులో ఉన్న తన ఫ్యామిలీ భయపడ్డారని, ఏం జరుగుతుందో అని టెన్షన్‌ పడ్డారని శోభా శెట్టి తెలిపింది. ఆ సీన్లు చూసి రాత్రి రాత్రి ఫోన్‌ చేసి వాళ్లు సఫర్‌ అవుతున్నారు. మీరేమో ఈజీగా చేస్తున్నారు, కానీ మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మా ఇంట్లో కూడా పేరెంట్స్ ఉన్నారు, వాళ్లు సఫర్‌ అవుతున్నారు. మాపైన చూపించే అభిమానానికి మేం థ్యాంక్స్ చెబుతాం. ఆ విషయంలో సంతోషంగా ఫీలవుతాం. 

కానీ లోపల జరిగిన తర్వాత దాన్ని బయట కూడా పెట్టుకుని, రివేంజ్‌లాగా ఒకరిని టార్గెట్‌ చేసి కొట్టడమనేది కరెక్ట్ కాదు. ఇలాంటి చేసే వాళ్లు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి, మాకే కాదు, మా ఫ్యామిలీ కూడా సఫర్‌ అవుతారు. జాగ్రత్తగా చేయండి, బిగ్‌ బాస్‌ఇంట్లో జరిగింది, ఇంటికే పరిమితం, ఇప్పుడు మేమంతా హ్యాపీగానే ఉన్నాం. మా మధ్య ఫైట్స్ బిగ్‌ బాస్‌కే పరిమితం, బయటకు వచ్చాక మేమంతా సంతోషంగానే ఉన్నామని తెలిపింది శోభా శెట్టి. ఫ్యాన్స్ ఆవేశానికి గురి కావద్దని తెలిపింది బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌.