Asianet News TeluguAsianet News Telugu

ప్రైవేట్ ప్లేస్ లో వస్తువులు దాచుకున్న శోభా శెట్టిపై యావర్ అటాక్.. కోపంతో రగిలిపోయిన హాట్ బ్యూటీ 

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో 31వ రోజు బుధవారం ఎపిసోడ్ చప్పగా సాగింది అనే చెప్పాలి. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఏమాత్రం ఆకట్టుకొని టాస్క్ లు  ఇచ్చారు.

Shobha Shetty and yavar ugly fight in bigg boss 7 dtr
Author
First Published Oct 4, 2023, 10:21 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో 31వ రోజు బుధవారం ఎపిసోడ్ చప్పగా సాగింది అనే చెప్పాలి. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఏమాత్రం ఆకట్టుకొని టాస్క్ లు  ఇచ్చారు. ఇంటి సభ్యుల పెర్ఫామెన్స్ కూడా ప్రేక్షకులకు నీరసం తెప్పించేలా సాగింది. 

రెండు టాస్క్ లు నిర్వహించగా రెండూ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కాసేపు యావర్, శోభా శెట్టి, శివాజీ గోల మినహా బుధవారం రోజులు హైలైట్స్ ఏమి లేవు. బిగ్ బాస్ తన ఫ్రెండ్ వద్ద కొన్ని వస్తువులు ఉన్నాయని తాను హింట్స్ ఇచ్చిన వస్తువులని ఇంటి సభ్యులు జంటలుగా వాటిని దొంగిలించాలని అంటూ పసలేని టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ చిన్న పిల్లల ఆటలా సాగింది. 

అయితే యావర్, శోభా శెట్టి మధ్య జరిగిన చిన్న పాటి ఘర్షణ హాట్ టాపిక్ గా నిలిచింది. తేజ దొంగిలించిన వస్తువులని బయటకి వచ్చాక శోభా శెట్టి లాక్కుంది. ఆమె టైట్ ఫిట్ డ్రెస్ లో తన షేపులు కనిపించేలా బోల్డ్ గా మెరిసింది. ఆ వస్తువుల కోసం యావర్ శోభా శెట్టిపై అటాక్ చేశాడు. దీనితో వీరిద్దరూ ఒకరినొకరు పెనవేసుకుని రచ్చ చేశారు. ఆ వస్తువులు తన ప్రైవేట్ ప్లేస్ లో ఉన్నాయంటూ అక్కడ తాకవద్దని శోభా శెట్టి ఇబ్బంది పడుతూ అరిచింది. ఇంతలో బిగ్ బాస్ కల్పించుకుని ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లాలని ఆదేశించారు. 

ఈ టాస్క్ లో శివాజీ ప్రశాంత్ మొదటి స్థానంలో విజేతలుగా నిలిచారు. ఆ తర్వాత జంటగా ప్రియాంక శోభా శెట్టి.. మూడవ స్థానంలో శుభశ్రీ గౌతమ్ జంట నిలిచారు. ఇక కెప్టెన్సీ పోటీ కోసం నిర్వహించిన టాస్క్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇంటి సభ్యులు తన పార్ట్నర్ తలపై ఉన్న జార్ లో బత్తాయిలు వేయాలి. ఎలా ఎక్కువ బత్తాయిలు సేకరించి ఎవరు ఎక్కువ జ్యూస్ చేస్తే వారే విజేత. ఈ టాస్క్ లో యావర్, తేజ జంట విజేతలుగా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో సందీప్, అమర్ డీప్ జంట.. శివాజీ, ప్రశాంత్ జంట నిలిచారు. అంతటితో నేటి ఎపిసోడ్ ముగిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios