Bigg Boss Telugu 7: శివాజీ పాము అని తేలిపోయింది.. శోభాకి తేజ పెళ్లి ప్రపోజల్..
అనంతరం కుండ బద్దలు కొట్టే గేమ్ ఆడాడు నాగ్. ఒక్కోక్కరు చేసిన తప్పులను ఎత్తిచూపుతూ వార్నింగ్ ఇచ్చారు. భోలే నామినేషన్ల ప్రక్రియలో నోరు చేసిన మాటలపై నిలదీశాడు.
బిగ్ బాస్ తెలుగు 7 షో ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. గత సీజన్‌తో పోల్చితే చాలా బెటర్‌గా ఉంది. ట్విస్ట్ లు, టర్న్ లు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ షో నేటితో యాభై రోజులు పూర్తి చేసుకుంది. హోస్ట్ నాగ్ ఈ విషయాన్ని హౌజ్‌లో ప్రకటించారు. ఇక శనివారం ఎపిసోడ్‌లో నాగ్ చేసిన ఫ్రాంక్ హైలైట్‌గా నిలిచింది. శోభా శెట్టి తనకు బిగ్ బాస్ ఇచ్చిన కేక్‌ని అమర్ దీప్‌కి ఇవ్వడం విషయంపై ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు నాగ్. శోభా శెట్టి అమర్‌కి ఎందుకిచ్చావని, అమర్ దీప్.. ఎందుకు తిన్నావని, తేజ చెప్పడంతో చేశానని అమర్ దీప్ చెప్పడం, ఓ వైపు అమర్ ని మరో వైపు తేజని, ఇంకో వైపు శోభాని కాసేపు ఆడుకున్నాడు నాగ్. చివరికి ట్విస్ట్ ఇస్తూ జస్ట్ ఫ్రాంక్ అని, కొత్తగా కేక్ తెప్పించి అమర్ దీప్‌కి ఇచ్చాడు. అలాగే అంతేకాదు ఈ వారం ఆట బాగా ఆడావని అభినందించాడు నాగ్.
అనంతరం కుండ బద్దలు కొట్టే గేమ్ ఆడాడు నాగ్. ఒక్కోక్కరు చేసిన తప్పులను ఎత్తిచూపుతూ వార్నింగ్ ఇచ్చారు. భోలే నామినేషన్ల ప్రక్రియలో నోరు చేసిన మాటలపై నిలదీశాడు. నోరుజారితే సరిచేసుకోవడం కష్టమని, జాగ్రత్తగా మాట్లాడాలని తెలిపారు. ఆ విషయంలో శోభాకి తాను సారీ చెప్పానని, అలాగే ఎర్రగడ్డ అనే పదం వాడటంపై కూడా నిలదీశాడు నాగార్జున. అందుకు భోలే సారీ చెప్పాడు. కానీ శోభా శెట్టి మాత్రం తాను క్షమించలేనని, ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. ఈ సందర్భంగా శోభా శెట్టి, తేజ మధ్య టాటూ బాండింగ్ గురించి లేవనెత్తాడు. గేమ్‌లో టాటూ వేయించుకుంటానని తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు వేయించుకోవాలన్నారు నాగ్. తాను వేయించుకోలేనని, అంత ప్రేమ లేదని చెప్పాడు. అయితే టెంపరరీగా వేయించుకోవడానికి రెడ అన్నారు.
అయితే పెళ్లి టాపిక్ వచ్చినప్పుడు శోభా అనే అమ్మాయి ఎందుకు, ఏకంగా శోభానే ఉన్నాక అని తేజ రియాక్ట్ అయిన తీరు నవ్వులు పూయించింది. అయితే తాను మాత్రం చేసుకోనని తెగేసి చెప్పింది శోభా. అంత సీన్ లేదని పేర్కొంది. అంతకు ముందు టాటూ వేసుకునేంత ప్రేమ లేదని తెలియజేయడం విశేషం. ఇందులో శివాజీ అనారోగ్యం టాపిక్ వచ్చింది. తనకు బాధగా ఉందని శివాజీ తెలిపారు. అయితే ఫిజియో థెరఫీ చేయిస్తానని నాగార్జున హామీ ఇచ్చారు. అలా సెట్ కాకపోతే బిగ్ బాస్ నిర్ణయం తీసుకుంటాడని తెలిపారు. ఊరోడు విషయంలో ప్రశాంత్ చేసిన కామెంట్లని నిలదీశాడు నాగ్.
అనంతరం లాడర్(నిచ్చెన), స్నేక్(పాము) గేమ్ ఆడించాడు నాగార్జున. తమకి హౌజ్‌లో పాము ఎవరు, నిచ్చెన ఎవరు అనేది చెప్పాలి. ఇందులో అశ్విని.. తనకు పాము శోభా శెట్టి అని, గౌతమ్ పాము అని, గౌతమ్.. పాము శివాజీ అని, నిచ్చెన అర్జున్ అని, శివాజీ.. నిచ్చెన యావర్ అని, పాము అమర్ దీప్ అని తెలిపారు. ప్రశాంత్ తనని ఎంతో మోటివేట్ చేస్తున్నారని తెలిపారు. అమర్ దీప్.. నిచ్చెన అర్జున్ అని, పాము తేజ అని చెప్పగా, తన గుడ్డు కూడా ఇచ్చానని తేజ చెప్పడం నవ్వులు పూయించింది. అర్జున్.. నిచ్చెన్న గౌతమ్ అని, పాము శివాజీ అని, యావర్.. పాము గౌతమ్ అని, నిచ్చెన శివాజీ అని చెప్పారు.
పూజా.. నిచ్చెన అర్జున్ అని, పాము అశ్విని అని తెలిపారు. భోలే.. నిచ్చెన శివాజీ అని, పాము శోబా శెట్టి అన్నారు శోభా.. పాము భోలే, నిచ్చెన ప్రియాంక, సందీప్.. నిచ్చెన శోబా శెట్టి, పాము శివాజీ అని, తేజ.. నిచ్చెన అమర్ దీప్ అని, పాము యావర్ అని, ప్రశాంత.. పాము పూజా అని, నిచ్చెన శివాజీ అని తెలిపారు. ఈ క్రమంలో నిచ్చెనెలుగా అర్జున, శివాజీలకు వచ్చింది. అదే పాములుగా శివాజీని తెల్చేశారు.