Asianet News TeluguAsianet News Telugu

‘‘ మా ’’ బిల్డింగ్‌పై వివాదం: అమ్మింది భవనం కాదు.. ఫ్లాట్, శివాజీరాజా క్లారిటీ

మా బిల్డింగ్ వివాదంపై సినీనటుడు శివాజీ రాజా స్పందించారు. అమ్మింది బంగ్లా కాదు.. డబుల్ బెడ్ రూం ఫ్లాట్ అని తెలిపారు. కొన్నది మా అసోసియేషన్‌కు సేవ చేసిన శ్రీధర్ అని చెప్పారు. తాను ప్రెసిడెంట్‌గా వున్నప్పుడే ఈ భవనాన్ని అమ్మినట్లు శివాజీరాజా తెలిపారు

shivaji raja reacts on maa building
Author
Hyderabad, First Published Sep 9, 2021, 2:35 PM IST

మా బిల్డింగ్ వివాదంపై సినీనటుడు శివాజీ రాజా స్పందించారు. అమ్మింది బంగ్లా కాదు.. డబుల్ బెడ్ రూం ఫ్లాట్ అని తెలిపారు. కొన్నది మా అసోసియేషన్‌కు సేవ చేసిన శ్రీధర్ అని చెప్పారు. తాను ప్రెసిడెంట్‌గా వున్నప్పుడే ఈ భవనాన్ని అమ్మినట్లు శివాజీరాజా తెలిపారు. యాడ్ ఇచ్చినా ఎవరు కొనకపోతే శ్రీధర్ తీసుకున్నారని.. అయితే ఇప్పుడు ఆయన కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సదరు ఫ్లాట్‌లోనే డైరెక్టర్స్, రచయితల సంఘం అసోసియేషన్ వుందని తెలిపారు. అద్దె రావడం లేదని దానిని అమ్మేస్తే బెటర్ అని మురళీమోహన్ చెప్పారని.. శివాజీ రాజా గుర్తుచేశారు. మా కమిటీ నిర్ణయం, ఈసీ మీటింగ్‌లో ఫ్లాట్ అమ్మకానికి ప్రతిపాదన చేశామని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇలాంటి విషయాలపై మాట్లాడటం సరికాదని శివాజీరాజా హితవు పలికారు. 

కాగా, ఎలక్షన్స్ నేపథ్యంలో మా బిల్డింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఇంతవరకు మా బిల్డింగ్ ఎందుకు నిర్మించలేక పోయారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మంచు విష్ణు సొంత డబ్బులతో బిల్డింగ్ నిర్మిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఉన్న పాత బిల్డింగ్ అంశం తెరపైకి తెచ్చిన నాగబాబు,  అధ్యక్షుడు నరేష్ తో పాటు మోహన్ బాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

2017లో అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజా, సెక్రెటరీగా ఉన్న నరేష్ 90లక్షల విలువ చేసే మా బిల్డింగ్ కేవలం 30లక్షలకు విక్రయించారని నాగబాబు ఆరోపిస్తున్నారు. 90లక్షల విలువ అంచనా వేసిన బిల్డింగ్ కేవలం 30.9 లక్షలకు అమ్మడం వెనుక కారణం ఏమిటో అప్పుడు సెక్రెటరీగా ఉన్న నరేష్ ని, అధ్యక్షుడు శివాజీ రాజాను మోహన్ బాబు అడగాలని నిలదీశారు. 

మార్కెట్ వాల్యూ కంటే అతి తక్కువ ధరకు అమ్ముతున్నట్లు ఆడిటర్ తనతో అన్నట్లు నాగబాబు గుర్తు చేసుకున్నారు. చివరకు అమ్మిన ధరలోనే రిజిస్ట్రేషన్స్ చార్జెస్ కూడా భరించి, తక్కువ ధరకు అమ్మారని విమర్శలు చేశారు.  రాబోయే ఎన్నికల్లో శ్రీకృష్ణుడు పాత్ర వహిస్తాను అంటున్న నరేష్ మీ క్యాంపైన్ లోనే ఉన్నారు. ఆయన్నే తక్కువ ధరకు మా బిల్డింగ్ ఎందుకు అమ్మారో అడిగి తెలుసుకోవాలని మోహన్ బాబును నిలదీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios