Bigg Boss Telugu 7: శివాజీ ట్విస్ట్ సుఖాంతం.. భోలే ప్రవర్తన పట్ల అసహనం.. ప్రశాంత్ పేరు జపించిన అశ్విని
ఏడో వారం ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ సోమవారం ఎపిసోడ్‌లో రసవత్తరంగా సాగింది. భోలే ప్రవర్తన విచిత్రంగా అనిపించింది. ప్రశాంత్, సందీప్‌ల గోడవ పీక్‌లోకి వెళ్లింది.

బిగ్ బాస్ తెలుగు 7 వ సీజన్ ఏదో వారంకి చేరుకుంది. ఇప్పటి వరకు హౌజ్ నుంచి ఆరుగురు అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు. ఈ ఆదివారం నయని పావని ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా ఆమె హౌజ్ నుంచి తప్పుకుంది. ఇక ఏడో వారం ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ సోమవారం ఎపిసోడ్‌లో రసవత్తరంగా సాగింది.
అంతకు ముందు శివాజీని హౌజ్ నుంచి ఇంటికి పంపించాడు బిగ్ బాస్. ఆయన భుజం నొప్పిగా ఉండటంతో స్కానింగ్ కోసం హౌజ్ నుంచి బయటకు వెళ్లారు. అయితే శివాజీ ఎలిమినేట్ అవుతున్నారనుకుని అంతా బాధపడ్డారు. కానీ కొద్ది సేపట్లోనే ఆయన హౌజ్‌లోకి వచ్చేశారు. అనంతరం కెప్టెన్‌కి కొన్ని సౌకర్యాలు కల్పించారు బిగ్ బాస్ ఇందులో తనకు సహాయకులుగా డిప్యూటీస్‌ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో కెప్టెన్ యావర్.. తనకు డిప్యూటీగా శివాజీని ఎంపిక చేసుకున్నాడు. రేషన్ చూసుకునే బాధ్యత అప్పగించారు. లగ్జరీస్ అందించాడు.
అనంతరం ఈ వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. హౌజ్‌లో అంతా సమానమే అని, ప్రతి ఒక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ తెలిపారు. యావర్ కెప్టెన్ కావడంతో ఆయన్ని నామినేట్ చేయడానికి లేదు. పల్లవి ప్రశాంత్ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించాడు. ఆయన సందీప్, తేజలను నామినేట్ చేశాడు. ఓ ఇష్యూలో తాను మధ్యలో వెళితే సందీప్ ర్యాష్‌గా రియాక్ట్ అయ్యాడనే కారణంతో నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గట్టిగా వాగ్వాదం జరిగింది. మరోవైపు తన అనుమతి లేకుండా కెప్టెన్ రూమ్‌లోకి తేజ వచ్చాడని నామినేట్ చేశాడు.
అమర్ దీప్.. భోలే, అశ్వినిలను నామినేట్ చేశాడు. నోరు అదుపులో పెట్టుకోవాలని, ఊరికే మాటలు వదిలేయొద్దని చెప్పారు. అదే కారణంగా అశ్వినినీ కూడా నామినేట్ చేశాడు. అయితే ఈ ఇద్దరి మధ్య వాదనలో అశ్విని పదే పదే ప్రశాంత్ పేరుని పిలవడంతో నవ్వులు పూయించింది. అమర్ దీప్ అసహనానికి గురయ్యాడు. అరే నువ్వు వచ్చి కొట్టురా అని చెప్పిన తీరు కామెడీని పండించింది. పూజా.. అశ్విని, భోలేలను నామినేట్ చేసింది. సందీప్.. భోలే, ప్రశాంత్‌ని నామినేట్ చేశాడు. మరోసారి ప్రశాంత్, సందీప్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మీది మీదికి వెళ్లే పరిస్థితి చోటు చేసుకుంది.
అర్జున్ కూడా భోలే, అశ్వినీలను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో భోలే రియాక్ట్ అయిన తీరు విచిత్రంగా అనిపించింది. తాను నవ్వుతూ, సెటైరికల్‌గా రియాక్ట్ అవుతున్న తీరు వింతగా అనిపించింది. ప్రియాంక సైతం భోలే, అశ్వినీలను నామినేట్ చేశాడు. భోలేపై ప్రియాంక గట్టిగా ఫైర్ అయ్యింది. అయినా ఆయన నవ్వుతూ, సెటైరికల్‌గా బాడీని ఊపుతూ, రారా, జోక్ లాగా ఉంటానంటూ స్పందించిన విధానం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.ఓవర్ గా అనిపించింది. తేజ.. పూజా, ప్రశాంత్‌లను నామినేట్ చేశారు.
సోమవారం ఎపిసోడ్‌లో కేవలం సగం మందే నామినేట్ చేశారు. రేపు మరో సగం మంది మిగిలి ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ రేపటి వరకు కొనసాగనుంది. కానీ ఈ నామినేషన్ల సమయంలో వారి వాదనలు పీక్‌లోకి వెళ్తున్నాయి. అశ్వినికి అర్థం కాదు, మూడు నాలుగు సార్లు చెప్పాల్సి వస్తుంది అంటూ అందరు అనడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అశ్వినీ, భోలేలను టార్గెట్ చేసినట్టుగా ఉంది. ఇప్పుడున్న దాని ప్రకారం, భోలే, అశ్విని, తేజ, ప్రశాంత్, నామినేషన్లలో ఉండబోతున్నారు.