Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7: హౌజ్‌లో శివాజీ గ్రాఫ్‌ పడిపోతుందా?.. నాగార్జున నిలదీసే పరిస్థితికి వచ్చాడుగా!

బిగ్‌ బాస్‌ తెలుగు 7 చివరి దశకు చేరుకుంది. మరో రెండు మూడు వారాల్లో షో క్లోజ్‌ కాబోతుంది. అయితే మొన్నటి వరకు టాప్‌ లో ఉన్న శివాజీ ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయాడా? నాగార్జున చెప్పింది అదేనా?

shivaji graph down nagarjuna asked questions he had no answer in bigg boss telugu 7 house arj
Author
First Published Dec 2, 2023, 6:07 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 7 షో చివరి దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో షో పూర్తి కాబోతుంది. ప్రస్తుతం పదమూడో వారం చివరికి చేరుకుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న వారిలో అంతా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లే ఉన్నారు. మరి గౌతమ్‌, శోభా, యావర్‌లో ఎవరు హౌజ్‌ని వీడతారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే ప్రారంభం నుంచి శివాజీ టాప్‌లో నిలుస్తూ వస్తున్నారు. ఆయన ఛాణక్య ఆటతీరుతో గెలుస్తూ వస్తున్నాడు. అన్ని పరిస్థితులను తనవైపు తిప్పుకుంటున్నాడు. తాను నిజాయితీగా ఆడుతున్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. బయటకు కూడా అదే ప్రొజెక్ట్ అయ్యింది. హౌజ్‌లో వీకెండ్‌లో నాగార్జున నిలదీసినప్పుడు కూడా అదే చెబుతున్నారు. ఏదో రకంగా కవర్‌ చేసుకుంటున్నాడు. తాను మాటలు జారడం కూడా కవర్‌ చేసుకునే తీరు కూడా ఫెయిర్‌గా అనిపించడం లేదు. 

అయితే మిడిల్‌లో ఆయనకు ఒక్కసారిగా గ్రాఫ్‌ పెరిగింది. హౌజ్‌లో ఆయన్ని నెగటివ్‌ గా అనుకున్న వాళ్లంతా తర్వాత ఆయనకు అనుకూలంగా మారిపోయాడు. ఆయన్ని హౌజ్‌లో దేవుడిని చేశారు. కానీ ఇటీవల ఆయన ఆట తీరు, ఆయన వ్యవహారశైలి కొంత నెగటివ్‌గా మారుతుంది. శివాజీ ఇతరుల విషయంలో కొన్ని మాటలు జరగడం, ఓగ్రూపుగా కూర్చొని ఇతర కంటెస్టెంట్లపై నెగటివ్‌ కామెంట్లు చేయడం కొంత ఆయనపై నెగటివిటీ పెరగడానికి కారణమవుతుంది. 

గత వారంలో ఎలిమినేషన్‌కి సంబంధించిన ప్రక్రియలో ఆయన కింద నుంచి మూడో స్థానంలో ఉన్నారు. అప్పుడే శివాజీ క్రేజీ పడిపోతుందనే సాంకేతాలు కనిపించాయి. ఇక ఈ వారం ఆటలో ఏమాత్రం ప్రదర్శన ఇవ్వలేదని, సరిగా ఆడలేదని, ఏమాత్రం కష్టపడకుండానే గేమ్‌ లో ఓడిపోయాడని తెలుస్తుంది. తాజాగా వీకెండ్‌లో వచ్చిన నాగార్జున శివాజీని నిలదీశాడు. టికెట్‌ టూ ఫినాలేలో సరిగా ఆడలేదని వెల్లడించారు. నాగ్‌ అడిగిన ప్రశ్నలకు శివాజీ సమాధానం చెప్పలేకపోయారు. ఇలా ఇటీవల కొన్ని యాక్టివిటీ జనాలకు నచ్చడం లేదు. దీంతో శివాజీ మైలేజ్‌ పడిపోతుందని తెలుస్తుంది. 

నిజానికి మధ్యలో విన్నర్‌ శివాజీనే అవుతాడనే కాన్ఫిడెన్స్ అందరిలోనూ కలిగింది. ఆ సత్తా అతనిలో ఉందని అంతా భావించారు. కనీసం టాప్‌ 3లో ఉంటారనే భావన కూడా కలిగింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన టాప్‌ 5లో తప్ప టాప్‌ 3కి రాలేడనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనికితోడు నేను ఇది ఆడలేదు, నేను ఇది భరించలేను, ఇది చూడలేను నన్ను పంపించండి బిగ్‌ బాస్‌ అంటూ పదే పదే శివాజీ అనడం కూడా ఆయనకు నెగటివ్‌గా మారుతుంది. ఏదో సింపతీ కోసం ఆయన ఇలా ఓవర్‌ చేస్తున్నాడనే అభిప్రాయం కూడా కలుగుతుంది. మరి ఇది గమనించి ఆయన తన ఆటతీరుని మెరుగుపరుచుకుని, మరింత హుందాగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతాడా? లేదా అనేది చూడాలి. అయితే ఈ వారంలో మాత్రం ముందుగా శివాజీ, ప్రశాంత్‌లు సేవ్ అయ్యారని తెలుస్తుంది. 

Read more: Bigg Boss Telugu 7: రంగంలోకి దిగిన అమర్ దీప్ భార్య, ప్రియాంక పై ఫైర్ అయిన తేజస్వి
 

Follow Us:
Download App:
  • android
  • ios