ఎప్పటినుంచో వెయిట్ చేస్తోన్న అవకాశం కళ్లముందు కనబడితే ఎవరైనా సరే జారవిడుచుకుంటారా? పక్కన ఎన్ని పనులున్నా పట్టించుకోకుండా అవకాశాన్ని అందుకోవాలని ట్రై చేస్తుంటారు. రీసెంట్ గా డైరెక్టర్ శివ కూడా అదే తరహాలో వెళ్ళాడు. 

రజినీకాంత్ నుంచి అఫర్ రావడంతో సూర్య సినిమాను వదిలేశాడు. గత కొన్నేళ్లుగా అజిత్ తో వరుసగా సినిమాలు తీసుకుంటూ వస్తోన్న ఈ మాస్ కమర్షియల్ దర్శకుడు ఇటీవల సూర్యను కలిసి ఒక కథను చెప్పాడు. సూర్య నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో త్వరలోనే సినిమాను స్టార్ట్ చేద్దామని మాట కూడా అనుకున్నారట. 

అయితే శివకు ఇటీవల రజిని నుంచి పిలుపు రావడంతో పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక ప్రాజెక్ట్ ను ఒకే చేసుకున్నాడు. అయితే శివ సూర్యకు ఈ విషయాన్నీ వెళ్లే ముందు చెప్పాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. సూర్య కూడా ఆ విషయాన్నీ ఎక్కువగా పట్టించుకోకుండా నెక్స్ట్ ఇయర్ మరో సినిమాను ప్లాన్ చేద్దామని సున్నితంగా అంగీకరించినట్లు టాక్.