సినీ రంగంలో హీరోయిన్లకు ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కొద్ది రోజులుగా మీటూ పేరుతో కాస్టింగ్‌ కౌచ్‌పై పెద్ద పోరాటమే సాగుతుండగా తాజాగా మర్యాద విషయంలోనూ హీరోయిన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి తెర మీదకు వచ్చింది. బాలీవుడ్‌ బ్యూటీ శిల్పా షిండే తాజాగా టీవీ షో గ్యాంగ్స్‌ ఆఫ్‌ ఫిలిమిస్థాన్‌ నుంచి తప్పుకుంటున్నట్టుగా క్లారిటీ ఇచ్చింది. దాదాపు రెండేళ్ల తరువాత ఈ షోతో రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఈ బ్యూటీ ఆ షో తాను చేయబోవటం లేదని ప్రకటించింది.

బాబీజీ గర్‌ పర్‌ హై తో ఫేమస్‌ అయిన ఈ బ్యూటీ షో గురించి మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యింది. `షో కోసం తాను 200 శాతం కష్టపడి పనిచేశాను. నేను ఎంతో హర్డ్ వర్క్‌ చేశాను కానీ అది ఎక్కడ ఏ మాత్రం కనిపించలేదు. అయితే నాకు టీంతో గానీ, స్టార్ కాస్ట్‌తో కానీ ఎలాంటి సమస్యా లేదు. వారంతా బెస్ట్ యాక్టర్స్‌. కానీ నేను ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తరువాత చాలా హర్ట్ అయ్యాను`

ఆ షో పూర్తిగా సునీల్ గ్రోవర్‌ను ప్రొజెక్ట్ చేసేందుకు మాత్రమే అని చెప్పింది శిల్ప. `షోలో నన్ను పూర్తిగా ఓ గ్లామర్‌ డాల్‌గా మాత్రమే  చూపించారు. కామెడీ అనేది మేడ్‌ డామినేటెడ్ జోనర్‌. ఇక నేను టెలివిజన్‌ షోస్ చేసేందుకు సిద్ధంగా లేను. నేను డబ్బు లేక అవకాశాల కోసం ఎదురుచూడటం లేదు. రెండేళ్ల తరువాత నేను ఓ షో చేస్తుంటే నాకు కనీసం స్పెషల్ ఎంట్రీ కూడా ఇవ్వలేదు. కపిల్‌ శర్మ షోలో ఇలాంటి పరిస్థితి ఉండదు. అలాగే నేను షో నిర్వాహకులకు ఓ ఛాలెంజ్‌ చేస్తున్నా.. మీరు సునీల్‌ గ్రోవర్‌ కోసం షో చేస్తున్నట్టైతే షోకు ది సునీల్ గ్రోవర్ షో అని పేరు పెట్టండి అంటూ కామెంట్ చేసింది.

సునీల్ గ్రోవర్