జాన్ అబ్రహంతో కలిసి శిల్పా శెట్టి మళ్లీ పాతరోజుల్లోకి వెళ్లింది. డోస్తానా స్టెప్పులతో సందడిచేసింది.  

శిల్పాశెట్టి, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా దోస్తానా. 2008లో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీని మరోసారి శిల్పా శెటి.. జాన్ అబ్రహం అభిమానులకు గుర్తు చేశారు. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్టీ ఎంతలా వర్కౌట్ అయ్యిందో అందరికి తెలుసు.. వీరి మధ్య హాట్ సాంగ్స్ కూడా అదరిపోయేలా హిట్ అయ్యాయి. 

దోస్తానా సినిమాలో షటప్ అండ్ బౌన్స్ పాట సూపర్ హిట్ అయ్యింద. ఈ పాటలో వీరిద్దరు హాట్ హాట్ గా కనిపించారు. ఇక మరోసారి వీరిద్దరు ఈ సాంగ్ కు చిందులేశారు. కలసి డ్యాన్స్ చేసిన వీడియోను బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఎక్కడ కలిశారు, ఎక్కడ ఈ డాన్స్ వేశారన్న విషయాన్ని మాత్రం వీళ్లు చెప్పలేదు. 

View post on Instagram

అప్పట్లో ఎంత ఉత్సాహంతో ఇద్దరూ డ్యాన్స్ చేశారో.. ఇప్పుడు వీడియోలో కూడా అంతే ఉత్సాహంతో స్టెప్పులేశారు వీరిద్దరు. ఈ వీడియోలో హడావిడికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పోస్ట్ కు శిల్పా ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. మాకు తెలియని కలయిక ఇదిఅంటూ శిల్పాశెట్టి పోస్ట్ పెట్టారు. 

ఇక జాన్ అబ్రహం పలు ప్రాజెక్టులపై పనిచేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలసి అటాక్; షారూక్ ఖాన్, దీపిక పదుకొణెతో కలసి పఠాన్, అర్జున్ కపూర్ దిషా పఠానిలతో కలసి ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలు చేస్తున్నాడు. శిల్పా శెట్టి కాంట్రవర్సీల సుడిగుండంలో తిరుగుతుంది.