Asianet News TeluguAsianet News Telugu

పోర్నోకేసు:పోలీస్ విచారణలో శిల్పాశెట్టి,ఏం చెప్పిందంటే...

 ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు శిల్పాశెట్టిని విచారించారు. 

Shilpa Shetty: They were erotica, not porn films jsp
Author
Hyderabad, First Published Jul 24, 2021, 2:51 PM IST

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ గుట్టు రట్టవడంతో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ కుంద్రాకు చెందిన వియాన్ కంపెనీ డైరెక్టర్లలో శిల్పా శెట్టి ఒకరిగా ఉన్నారు. ఇటీవలే ఈ కంపెనీ కార్యాలయంపై దాడులు జరిపి భారీగా పోర్న్ వీడియోలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శిల్పా శెట్టిని అరెస్ట్ చేసే అవకాశముందని వార్తలు వచ్చాయి.   ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు శిల్పాశెట్టిని విచారించారు. శుక్రవారం కుంద్రాను వెంటబెట్టుకుని ఆయన ఇంటికి వెళ్లి శిల్పాశెట్టిని ప్రశ్నించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని వెళ్లారు.  పోలీసులు శిల్పా శెట్టిని ఆమె ఇంటిలో ఏకంగా ఆరు గంటలపాటు విచారించారు. 

భర్త చేస్తున్న అశ్లీల చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ వంటి వ్యవహారాల్లో ఆమెకేమైనా వాటా ఉందా?.. వియాన్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న శిల్పా ఉన్నట్టుండి గతేడాది ఆ బాధ్యతల నుండి తప్పుకోవడానికి గల కారణాలేంటి? అనే విషయాల గురించి పోలీసులు ప్రశ్నించారని బాలీవుడ్ మీడియా చెప్తోంది. ఇంతకీ శిల్పాశెట్టి ఏమంటోంది ఈ విషయంలో అంటే ఆమె తన పాత్రను ఖండిస్తోందని సమాచారం. 

అంతేకాదు ఆ వీడియోలు ఫోర్న్ వీడియోలు కాదని, కేవలం ఎరోటికా వీడియోలు అని చెప్తోంది. అదేమీ క్రైమ్ కాదని, అలాంటి కంటెంట్ లీగల్ స్ట్రీమింగ్ ద్వారా అనేక సైట్ లలో లభ్యమవుతోందని పోలీస్ లతో చెప్పినట్లు సమాచారం. అంతకు ముందు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు చర్చనీయాంశం అయింది. గతంలో తాను ఎన్నో సవాళ్లను అధిగమించానని, ఇప్పడూ వాటిని ఎదుర్కొంటానని.. తన జీవితాన్ని ఏదీ ప్రభావితం చేయలేదని అందులో వ్యాఖ్యానించారు. 

మరో వైపు  రాజ్‌ కుంద్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తాను నిర్మించిన సినిమాలు పోర్న్‌ చిత్రాల కిందకు రావని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందులో పాత్రధారుల వాంఛను వ్యక్తపరిచే సన్నివేశాలే తప్ప, నేరుగా లైంగిక ప్రక్రియను చూపించే దృశ్యాలు లేవని తెలిపారు. కాబట్టి తనను ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67ఏ(అశ్లీల సమాచార ప్రచురణ, ప్రసారం) కింద అరెస్టు చేయడం అక్రమమని పేర్కొన్నారు. దీంతోపాటు తనకు ముందస్తు నోటీసులు ఇచ్చి వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా నేరుగా అరెస్టు చేశారని తెలిపారు. పోలీస్‌ కస్టడీని విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని అభ్యర్థించారు. 

కుంద్రా తన సంస్థ వియాన్‌ ద్వారా ముంబయిలో అశ్లీల చిత్రాలు నిర్మించి బ్రిటన్‌లోని తన బంధువు సాయంతో అక్కడి నుంచి హాట్‌షాట్స్‌ అనే యాప్‌లో వాటిని అప్‌లోడ్‌ చేస్తున్నారన్న అభియోగాలతో ఈనెల 19న ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 
 
కుంద్రా అరెస్టు సమయంలో 23 వరకూ పోలీస్‌ కస్టడీని విధించిన మేజిస్ట్రేట్‌ కోర్టు శుక్రవారం దాన్ని 27 వరకూ పొడిగించింది. దీన్ని కుంద్రా హైకోర్టులో సవాల్‌ చేశారు. తనపై పెట్టిన సెక్షన్ల కింద 7 ఏళ్లకు మించి జైలు శిక్ష పడదని, అలాంటి సందర్భాల్లో ముందస్తు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంందని, కానీ నిబంధనలకు విరుద్ధంగా నేరుగా అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, కుంద్రా కార్యాలయంలో చేసిన సోదాల్లో టెరాబైట్ల కొద్దీ పోర్న్‌ వీడియోలు లభ్యమైనట్లు దర్యాప్తు బృంద సన్నిహిత వర్గాలు తెలిపాయి. భారీ ఎత్తున డేటాను తొలగించినట్లు తేలిందని, దాన్ని వెలికి తీసేందుకు ఫోరెన్సిక్‌ నిపుణుల సాయం తీసుకుంటున్నట్లు చెప్పాయి.

Follow Us:
Download App:
  • android
  • ios