ఆస్తులను శిల్పాశెట్టి పేరు మీదకు రాజ్ కుంద్రా ఎందుకు మార్చాడు ? దీనికి కారణం ఏమై ఉంటుంది ? అని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం రాజ్‌కుంద్రాపై పోర్నోగ్రఫీ ఆరోపణలతోపాటు మనీ లాండరింగ్ కేసు కూడా నడుస్తుంది.
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా గతేడాది అశ్లీల చిత్రాల కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. అవకాశాలు పేరుతో అశ్లీల వీడియోలు చిత్రీకరించినట్టు ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేశారు. జైలుకి వెళ్లిన రాజ్‌కుంద్ర బెయిల్‌పై బటయకు వచ్చారు. అయితే రాజ్‌కుంద్రాపై పోర్నోగ్రఫీ ఆరోపణల నేపథ్యంలో నటి శిల్ప శెట్టిపై అనేక విమర్శలు వచ్చాయి. వారిపై అనేక కథనాలు ప్రసారమయ్యారు. ఆమె తన పరువు పోయిందంటూ కోర్ట్ ని కూడా ఆశ్రయించారు.
ఇదిలా ఉంటే రాజ్‌కుంద్రా బయటకు వచ్చాక శిల్పాశెట్టితో తీవ్రమైన చర్చలు జరిగాయని, వారి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుందనే వార్తలు బాలీవుడ్ మీడియాలో వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రాజ్ కుంద్రా ఆస్తులు పంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజ్‌కుంద్రా తన ఆస్తులు కొంత భాగం భార్య శిల్పాశెట్టిపై రిజిస్టర్ చేయించారు. ఈ వార్తల పై ఎలాంటి క్లారిటీ లేదు. అసలు ఉన్నట్టు ఉండి ఆస్తులను శిల్పాశెట్టి పేరు మీదకు రాజ్ కుంద్రా ఎందుకు మార్చాడు ? దీనికి కారణం ఏమై ఉంటుంది ? అని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు.
అయితే ప్రస్తుతం రాజ్‌కుంద్రాపై పోర్నోగ్రఫీ ఆరోపణలతోపాటు మనీ లాండరింగ్ కేసు కూడా నడుస్తుంది. దీని వల్ల తన పేరుతో ఉన్న ఆస్తులు వివాదాల్లోకి వెళ్లే ఛాన్స్ ఉందని భావించి వాటిలో చాలా వరకు భార్య శిల్పాపేరుతో మార్చారని తెలుస్తుంది. వీటి విలువ 38 కోట్లకు పైగా ఉంటుందని అంచన. అంతేకానీ ఈ జంట విడాకులకు సిద్ధమైందనే వార్తలో మాత్రం వాస్తవం లేదని బాలీవుడ్ సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే వీరి లావాదేవీ వివరాలను జప్ కే డాట్ కామ్ జనవరి 21న వెలుగులోకి తీసుకొచ్చింది. జుహూలోని గాంధీగ్రామ్ రోడ్డులో సముద్ర తీరానికి 300 మీటర్ల దూరంలో ఈ అపార్ట్ మెంట్ ఉంది. శిల్పా శెట్టితో కలిసి కుంద్రా ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నారు. ఇందులో మొదటి అంతస్తులోని ఐదు ఫ్లాట్స్ రాజ్ కుంద్రా పేరుమీదే ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 5,995 చదరపు అడుగుల ఈ ప్లాట్స్ శిల్పా శెట్టి సొంతం అయినట్టు సమాచారం. అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో ప్రస్తుత మార్కెట్ విలువ ఒక్కో చదరపు అడుగు 65,000 వరకూ ఉంది. ఈ లావాదేవీలో భాగంగా శిల్పాశెట్టి దాదాపు 1.9 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్టు బాలీవుడ్‌లో కథనాలు వెలువడ్డాయి.
