Asianet News TeluguAsianet News Telugu

`శేఖర్‌` సినిమాని అడ్డుకుంటే పరువు నష్టం దావా వేస్తాః చిత్ర నిర్మాత స్ట్రాంగ్‌ వార్నింగ్‌

రాజశేఖర్‌ హీరోగా నటించిన `శేఖర్‌` మూవీని వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో ఫైనాన్షియల్‌ కోర్ట్ ని ఆశ్రయించిన నేపథ్యంలో చిత్ర నిర్మాత స్పందించి వార్నింగ్‌ ఇచ్చారు.

shekar movie producer beeram sudhakara reddy warning to financiers who approached court
Author
Hyderabad, First Published May 21, 2022, 8:05 PM IST

హీరో రాజశేఖర్‌(Rajashekar) నటించిన `శేఖర్‌`(Shekar) చిత్రాన్ని, జీవితా రాజశేఖర్‌లను పలు వివాదాలు వెంటాడుతున్న విషయం తెలిసిందే. గత సినిమా `గరుడవేగ` విషయంలో ఆ చిత్ర నిర్మాతలు తమకు ఇవ్వాల్సిన మనీ ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. దీంతో ఆ ఇష్యూ పెద్ద కాంట్రవర్సీగా మారింది. తాజాగా మరో ఫైనాన్షియర్‌ తమకు రూ. 65లక్షలు ఇవ్వాల్సి ఉందంటూ కోర్ట్ కి ఎక్కారు. దీంతో `శేఖర్‌` సినిమా నిర్మాత బీరం సుధాకర్‌రెడ్డి స్పందించారు. `శేఖర్‌` సినిమాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. 

ఆయన ఈ ఇష్యూ(Shekar Movie Controversy)పై స్పందిస్తూ, తానే `శేఖర్‌` సినిమాని నిర్మాతని అని, జీవిత రాజశేఖర్‌ తమ సినిమాకి దర్శకత్వం వహించారని, రాజశేఖర్‌ హీరోగా నటించానని, వాళ్లిద్దరికి పారితోషికం చెల్లించానని తెలిపారు. ఈ సినిమా రాజశేఖర్‌, జీవిత గార్లది అనుకుని ఎవరో కోర్టు కి వెళ్లారు. నా సినిమాకు వాళ్లు నష్టం కలిగిస్తే, ఏదైనా జరిగితే, నేను పరువు నష్టం దావా కేసు వేస్తా. నేను నష్టపోయిన మొత్తాన్ని వాళ్ల నుంచి రాబడతా అంటూ హెచ్చరించారు. నా సినిమాని ఎవరికీ అమ్మకూడదని రకరకాలుగా వార్తలు ప్రచారం చేస్తున్నారు. అది చెల్లదు. నేనే అసలు నిర్మాతని` అని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉంటే శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి సంబంధించి  ఎ.పరంధామరెడ్డి, (ఫైనాన్షియర్గ్) దగ్గర Rs. 65,00,000/- (అరవై ఐదు లక్షల రూపాయలు) అప్పుగా తీసుకున్న నిర్మాత,దర్శకురాలు  శ్రీమతి జీవిత రాజశేఖర్ తిరిగి చెల్లించకపోవడంతో పరంధామరెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు హైదరాబాద్ లోని గౌరవనీయ  సిటీ సివిల్ కోర్టు 48 గంటల లోగా అనగా ఆదివారం సాయంత్రం 4-30 గంటలు లోగా Rs. 65,00,000/- (అరవై ఐదు లక్షల రూపాయలు) సెక్యూరిటీ డిపాజిట్ గా కోర్టులో శ్రీమతి జీవిత రాజశేఖర్ సమర్పించాలని తెలిపారు. 

ఒకవేళ అలా డిపాజిట్ చేయలేనిపక్షంలో ''శేఖర్" సినిమాకు సంబందించిన సర్వ హక్కులను (నెగటివ్ రైట్)అటాచ్ మెంట్ చేస్తూ అనగా థియేటర్స్ లో కానీ డిజిటల్, శాటిలైట్, ఓటీటీ, ఎటీటీ, యూట్యూబ్ వంటి  వివిధ రకాల ఫ్లాట్ ఫామ్స్ లో సినిమా తోపాటు ట్రైలర్ స్,పాటలతోసహ ఎలాంటి కంటెంట్ ఎక్కడా ప్రసారం చేయకుండా నిలుపుదల చేస్తూ, కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అటాచ్ మెంట్ అమలులోకి వస్తే, ఆదివారం సాయంత్రం తర్వాత 'శేఖర్" సినిమాను ఏ ఫ్లాట్ ఫామ్స్ లో ఎవరు ప్రదర్శించినా CONTEMPT OF COURT అవుతుందని ఎ.పరంధామరెడ్డి హెచ్చరించారు. దీనిపై తాజాగా బీరం సుధాకర్‌రెడ్డి స్పందించి క్లారిటీ ఇచ్చారు. 

`శేఖర్‌` సినిమా గురించి ఆయన మాట్లాడుతూ, రాజశేఖర్ నా చిన్నప్పటి ఫెవరేట్ హీరో. తనంటే నాకు ఎంతో ఇష్టం గరుడవేగ సినిమాకు తనతో జర్నీ చేశాను.ఆ పరిచయంతో వారు మళ్లీ సినిమా చేద్దామని చెప్పారు.మేము చేసిన రీమేక్ సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి.`జోసెఫ్`సినిమా బాగుంది చేద్దామని జీవిత రాజశేఖర్ లు చెప్పడంతో.. కోవిడ్ టైం లో దుబాయ్ లో ఉన్న నేను మలయాళం జోసెఫ్ సినిమా చూడడం జరిగింది.ఆ సినిమా నాకు బాగా నచ్చింది. ఇది మలయాళం సినిమా కదా తెలుగు ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందా లేదా అనుకున్నాం.అయితే చూసిన ప్రేక్షకులందరూ  క్లైమాక్స్ అదిరిపోయింది  రాజశేఖర్ గారు    ఆడియన్స్ మంచి మెసేజ్ ఇచ్చారు అని చెప్పడంతో మాకు చాలా సంతోషం వేసింది.మా సినిమాను రిసీవ్ చేసుకొని హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు.

ఈ సినిమాను తెలుగు,కన్నడ  రాష్ట్రాల్లో 300 థియేటర్లలో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే విడుదల చేసిన అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురి పాత్రకు శివానీ అయితే ప్రేక్షకులు కూడా  ఈజీగా ఐడెంటిఫై చేస్తారని శివాని ని సెలెక్ట్ చేయడం జరిగింది. మేమంతా ఆనుకున్నట్లే శివాని చాలా బాగా నటించింది. ప్రేక్షకులనుండి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. మంచి మెసేజ్ ఉన్న ఈ చిత్రాన్ని థియేటర్ లో రిలీజ్ చేద్దామనే తీశాము తప్ప ఓటిటి కని ఈ సినిమా తీయలేదు. జీవిత మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండడంతో దర్శకురాలిగా తనైతే కరెక్ట్ అని ఈ ప్రాజెక్ట్ ను జీవిత గారికే అప్పజెప్పడం జరిగింది.ఈ సినిమా కు వారంతా చాలా కష్టపడ్డారు. వారి కష్టానికి మాకు ఫలితం దక్కింది ఆనుకుంటున్నాను.

నాకు బీరం పుల్లారెడ్డి అనే చారిటబుల్ ట్రస్ట్  ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము.అందుకు గాను నాకు లాస్ట్ మంత్ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. దుబాయ్ లో కూడా నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను.కోవిడ్ టైం లో చాలా మందిని ఎయిర్ ఇండియా ద్వారా పంపియ్యడం జరిగింది. నాకు సినిమానే ప్రొఫెషన్ కాదు. నాకున్న బిజినెస్ లు చూసుకుంటూ ఇండస్ట్రీ లో నాకున్న చాలా మంది ఫ్రెండ్స్ సినిమాలకు నేను ఇన్వెస్ట్ చేస్తాను తప్ప నిర్మాత గా మారి సినిమా చేసే ఆలోచనలేదు.కార్తికేయ నుండి ఇప్పటివరకు సుమారు 15 సినిమాలకు ఇన్వెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు సుధాకర్‌ రెడ్డి.
 

Follow Us:
Download App:
  • android
  • ios