ఒక్కోసారి చిన్న పొరపాటు పెద్ద విషయాలను బయటకు వచ్చేలా చేస్తుంది. హడావిడిగా మాట్లాడే మాటల నుంచి పెద్ద పెద్ద రహస్యాలు బయటకు వస్తుంటాయి. సరిగ్గా అలానే స్టార్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ పొరపాటున మెగాస్టార్ 154 మూవీ టైటిల్ ను రివిల్ చేశారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ బిజీగా ఉన్న డాన్స్ మాస్టర్ లలో శేఖర్ మాస్టర్ టాప్ పొజీషన్ లో ఉన్నారు. ఢీ షో తో తన టాలెంట్ ఫ్రూ చేసుకున్న శేఖర్ మాస్టర్.. అదే ఢీ షోకి జార్జిగా చేసే స్థాయికి ఎదిగారు. అంతే కాదు దాదాపు టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలందరికీ.. శేఖర్ మాస్టర్ ఓన్లీ ఆప్షన్ అయ్యారు. ప్రస్తుతం అగ్ర హీరోల దగ్గరి నుండి చిన్న హీరోల సినిమాల వరకు వరుస సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ.. బిజీ గా ఉన్నారు.
ఇక మెగా హీరోలలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనిది ఒక్క పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ కే. ఆ టైమ్ ఇంకా రాలేదంటున్న శేఖర్ మాస్టర్ .. రీసెంట్ గా మెగాస్టార్ ఆచార్య సినిమాకు శేఖర్ మాస్టర్ పనిచేశారు. రీసెంట్ గా ఆచార్య నుండి వచ్చిన భలే భలే సాంగ్ కు శేఖర్ కొరియోగ్రఫీ చేసారు. ఈ సాంగ్ లో చిరంజీవి , చరణ్ ల చేత అదిరిపోయే స్టెప్స్ వేయించారు శేఖర్. ఈ సాంగ్ శాంపిల్ చూస్తేనే అదిరిపోతుంది.. ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
వరుసగా మెగా మూవీస్ చేస్తున్న శేఖర్ మాస్టర్.. నోరుజారి చిరు 154 మూవీ టైటిల్ ను రివీల్ చేసి షాక్ ఇచ్చాడు. యంగ్ డైరెక్టర్ కె.ఎస్. రవీంద్ర బాబీ రూపొందిస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ జోడీగా శ్రుతి హాసన్ గా చేస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.
మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో మాస్ మహారాజ్ఖ హీరో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్య , వాల్తేరు వీరన్న , మాస్ మూల విరాట్ ఇలా పలు టైటిల్స్ తెరపైకి వచ్చాయి. కానీ చిత్ర టీమ్ మాత్రం టైటిల్ ను రివిల్ చేయకుండా సస్పెన్స్ ను కొనసాగిస్తోంది. అయితే ఇలాంటి సమయంలో శేఖర్ మాస్టర్ మెగా 154 టైటిల్ ను లీక్ చేసేశారు.
రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో శేఖర్ ను యాంకర్ మీ అప్ కమ్మింగ్ సినిమాలు ఏంటీ అని అడగ్గా.. అందుకు శేఖర్ మాస్టర్ సమాధానం చెపుతూ.. రవితేజగారు నటిస్తున్న ధమాకా, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు చేస్తున్నాను తమళంలో రెండు ప్రాజెక్ట్ లు అలాగే చిరంజీవిగారితో భోళా శంకర్ , వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నా అంటూ.. నోరు జారారు. దీంతో మెగా 154 టైటిల్ వాల్తేరు వీరయ్య అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్.
అంత పెద్ద మ్యాటరు తెలిసో తెలియకో శేఖర్ మాస్టార్ రివిల్ చేశారు. మరి మెగా టీమ్ నుంచి ఆయనకు ఎటువంటి చీవాట్లు పడతాయో చూడాల. అయితే ఈ నోరు జారుడు పర్వం ఇప్పటిది కాదు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ ఆడియో ఫంక్షన్ లో ఆచార్య సినిమా టైటిల్ ను తెలియకుండానే నోరు జారి చెప్పేశారు. ఇప్పుడు మెగా 154 మూవీ టైటిల్ కూడా సడెన్ గా ఇలా రివిల్ అయ్యింది.
