Asianet News Telugu

రాజమౌళి బాటలో శేఖర్ కమ్ముల.. నిర్మాత విలవిల!

రాజమౌళికి  రాజీ అనేది ఉండడని అంటూంటారు. అయితే ఆయన కెరీర్ లో అన్ని పెద్ద హిట్స్, భారీ బడ్జెట్ చిత్రాలే కావటంతో ఎవరికీ ఏ అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పుడు అదే రూట్ లో శేఖర్ కమ్ముల సైతం ప్రయాణం పెట్టుకున్నాడట. 

Shekar Kammulas Love story not come to this summer
Author
Hyderabad, First Published Mar 9, 2020, 12:38 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రముఖ దర్శకుడు రాజమౌళికి ఓ పేరు ఉంది..జక్కన్న అని.  సినిమా బాగా వచ్చి, తను తృప్తిపొందేదాకా తీస్తూనే ఉంటాడని, మొహమాట పడడని, రాజీ అనేది ఉండడని అంటూంటారు. అయితే ఆయన కెరీర్ లో అన్ని పెద్ద హిట్స్, భారీ బడ్జెట్ చిత్రాలే కావటంతో ఎవరికీ ఏ అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పుడు అదే రూట్ లో శేఖర్ కమ్ముల సైతం ప్రయాణం పెట్టుకున్నాడట. ఆయనలా తన సినిమాని రోజు ఎడిటింగ్ లో చూసుకోవటం మళ్లీ మళ్లీ అవే సీన్స్ ని తీస్తూ చెక్కుడు మొదలెట్టడం చేస్తున్నాడని సమాచారం. దాంతో నిర్మాతకు, హీరో,హీరోయిన్స్ కు ఏం చేయాలో పాలు పోవటం లేదు అంటున్నారు.

వివరాల్లోకి వెళితే..నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో మొదలెట్టిన లవ్ స్టోరీ సినిమా ప్రారంభించినప్పుడు కేవలం నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేసి ఇస్తానని మాట ఇఛ్చారట. దాంతో హీరో,హీరోయిన్స్ ఇద్దరూ మిగతా ప్రాజెక్టులను ప్రక్కన పెట్టి ఈ సినిమా సైన్ చేసి షూటింగ్ కు వచ్చేసారు. అయితే నాలుగు నెలులు దాటి నాలుగు నెలలు అయ్యింది. అయినా సినిమా ఓ కొలిక్కి రాలేదట. దాంతో ఏమిటి ..శేఖర్ కమ్ముల సైతం రాజమౌళి లాగ చేస్తున్నాడని నిర్మాతలు వాపోతున్నారట. దాంతో ఈ సినిమా ఈ సమ్మర్ కు వచ్చే పరిస్దితి కనపడటం లేదంటున్నారు. జూలై లో కూడా కష్టమే అని తేలుస్తున్నారు. అలాగని శేఖర్ కమ్ములని అడిగే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారట.

 స్టోరీ లైన్ గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వూలో శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు. శేఖర్ కమ్ముల చెప్పిన దాని ప్రకారం ఈ సినిమాలో హీరో,హీరోయిన్స్ ఇద్దరూ కూడా రూరల్ తెలంగాణా నుంచి సిటీకు పెద్ద పెద్ద కలలు,కోరికలతో వస్తారు. వాటిని నెరవేర్చుకునే క్రమంలో వాళ్లిద్దరూ చాలా ఇబ్బందులు,కష్టాలు పడతారు. ఆ జర్నీలోనే వీళ్దిద్దరూ కలవటం జరుగుతుంది. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ తమను తాము ప్రపంచం ముందు ఎలా ఆవిష్కరించుకున్నారనే యాంగిల్ చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుంది. వీరిద్దరూ తెలంగాణా స్లాంగ్ లోనే మాట్లాడతారు. ఇది కొన్ని జీవితాలను కొత్త కోణంలో చూపిస్తుంది. తెలుగు తెరపై ఇలాంటి కథ చూడలేదు. నేటి యూత్ జీవితానికి బాగా దగ్గరగా ఉండే సినిమా ఇది. ముఖ్యంగా హీరో,హీరోయిన్స్ పాత్రలు ప్రేక్షకులకు బాగా పడతాయని చెప్తున్నారు. 
  
సునిశితమైన భావోద్వేగాలను బలంగా తెరమీద పలికించగల విజనరీ ఉన్న శేఖర్ కమ్ముల అందించబోతున్న ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ట్:రాజీవ్ నాయర్, సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్, సహా నిర్మాత : విజయ్ భాస్కర్, పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా, డిజిటల్ మార్కెటింగ్: నీహారిక గాజుల,మ్యూజిక్ : పవన్, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు, రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల
 

Follow Us:
Download App:
  • android
  • ios