దర్శకుడు శేఖర్ కమ్ముల కెరీర్ లో మొదటిసారి ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. సాధారణంగా ఒక సినిమా పూర్తయితే చాలా గ్యాప్ తీసుకునే కమ్ముల ఫిదా సక్సెస్ తో స్పీడ్ పెంచాడు. సాయి పల్లవి - నాగ చైతన్య తో ఒక సినిమా చేయబోతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. 

అయితే ఆ ప్రాజెక్ట్ ని చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టింది. శేఖర్ కమ్ముల ఇదివరకే మొదలుపెట్టిన లవ్ స్టోరీ ప్రస్తుతం ఎండింగ్ దశలో ఉంది. ఆ సినిమా పనులు అయిపోగానే సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. 

ఫిదా సినిమాతో సాయి పల్లవికి మంచి సక్సెస్ ఇచ్చిన శేఖర్ కమ్ముల మళ్ళీ ఆమెను డైరెక్ట్ చేయబోతుండడంతో నాగ చైతన్య ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక గతంలోనే నాగ చైతన్యతో వర్క్ చేయాలనీ ఈ డిఫరెంట్ దర్శకుడు ప్లాన్ చేసినప్పటికీ కుదరలేదు. ఫైనల్ గా ఇప్పటికి కుదిరింది. మరి ఈ స్పెషల్ కాంబో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.