ఫిదా సినిమాతో గత ఏడాది వరుణ్ తేజ్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. టాలీవుడ్ లో దర్శకులందరికి బిన్నంగా ఉండే శేఖర్ కమ్ముల నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ తో రాబోతున్నాడా అనే విషయం ఆసక్తిగా మారింది. 

ఫిదా సినిమాతో గత ఏడాది వరుణ్ తేజ్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. టాలీవుడ్ లో దర్శకులందరికి బిన్నంగా ఉండే శేఖర్ కమ్ముల నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ తో రాబోతున్నాడా అనే విషయం ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో అభిమానుల నుంచి ఆయనకు ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. 

ఆ మధ్య నాని అలాగే రానా వంటి హీరోలతో సినిమా చేస్తున్నట్లు టాక్ వచ్చింది కానీ అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. ఇక రీసెంట్ గా ఏషియన్ సునీల్ నిర్మాణ సారథ్యంలో సినిమా చేయాలనీ ఫిదా డైరెక్టర్ ఫిక్సయినట్లు సమాచారం. డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న ఏషియన్ సునీల్ చాలా కాలంగా నిర్మాతగా మారాలని అనుకుంటున్నారు. శేఖర్ కమ్ములతో సినిమా చేయాలనీ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారు. 

ఫైనల్ గా మంచి కథ కుదరడంతో నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నట్లు సమాచారం. అయితే స్టార్ హీరోలను కాకుండా న్యూ ఫెస్ ని పరిచయం చేయాలనీ దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆడిషన్స్ నిర్వహించి అందులో ఫైనల్ గా అయిదుగురిని తీసుకొని ఒకరిని సెలక్ట్ చేయాలనీ కమ్ముల భావిస్తున్నారట. త్వరలోనే షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.