పూర్తిగా నూతన నటీనటులతో మహేష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రం హవా. డిఫరెంట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా కాసెప్ట్ పోస్టర్ ని దర్హకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. హవా చిత్ర యూనిట్ శేఖర్ కమ్ములను కలిసి సినిమాకు సంబందించిన విశేషాలను వివరించింది. 

దీంతో శేఖర్ కమ్ముల చిత్ర యూనిట్ ను మెచ్చుకొని టైటిల్ తో పాటు కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉందని, సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్లు అన్నారు. ఇక డిఫరెంట్ సినిమాలతో వచ్చే వారికి ఎప్పుడైనా మంచి కెరీర్ ఉంటుందని చెబుతూ అదే విధంగా సినిమా మంచి విజయం సాధించి నటులకు టెక్నీషియన్స్ కి మంచి గుర్తింపు తేవాలని వారికి విషెష్ అందించారు. 

ఇక దర్శకుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. 9 గంటలు నడిచే కథ అందరికి నచ్చుతుంది. శేఖర్ కమ్ముల గారు ప్రత్యేకంగా సినిమా గురించి ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది.ఆయన ఉత్సాహపరిచిన విధానం మాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని మహేష్ వివరణ ఇచ్చాడు.