బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా తన పేరు మీటూలో ఉండాల్సిందని కామెంట్స్ చేశారు. తన రాసలీలలు బయటకి రాకపోవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు ఈ నటుడు. తను చాలా అదృష్టవంతుడునని చెప్పిన ఈ బాలీవుడ్ స్టార్ హీరో.. తను ఎన్నో చేసినట్లు కానీ అవి బయటకి రాలేదని చెప్పుకొచ్చాడు.

ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో  మీటూ ఉద్యమం ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. మీటూ ఆరోపణల్లో పెద్ద దర్శకులు, నటుల పేర్లు వినిపించాయి. అలా పేర్లు బయటకి వచ్చిన చాలా మందిని ఇండస్ట్రీ బ్యాన్ చేసింది.

కేంద్రమంత్రిపై ఈ ఎఫెక్ట్ పడింది. అంతగా ఉదృతంగా సాగింది మీటూ ఉద్యమం. అటువంటి సమయంలో కూడా తన పేరు వినిపించకపోవడంపై శత్రుఘ్న సిన్హా చాలా ఆనందంగా ఉన్నట్లు ఉన్నాడు.

అయితే ఇదంతా తాను సరదాగా అన్నట్లు కవర్ చేశాడనుకోండి.. కానీ అందులో నిజం ఉండే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆయన ప్రతి సక్సెస్ ఫుల్ మగాడి పతనం వెనుక ఓ ఆడది ఉంటుందని వెటకారంగా స్టేట్మెంట్లు కూడా ఇచ్చాడు.