శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం 'రణరంగం'. స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. శర్వానంద్ రఫ్ లుక్ లో కనిపించిన ఫస్ట్ లుక్ చిత్రంపై ఆసక్తి పెంచేసింది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. 

శర్వానంద్ ప్రజెంట్ లో మిడిల్ ఏజ్డ్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడు. ' దేవుణ్ణి నమ్మాలంటే భక్తి ఉండాలి.. అదే మనిషిని నమ్మాలంటే ధైర్యం ఉండాలి' అనే డైలాగ్ చాలా బావుంది. ఇక కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1990 నేపథ్యంలో ఈ చిత్రంలో ప్లాష్ బ్యాక్ ఉండబోతున్నట్లు దర్శకుడు టీజర్ ద్వారా తెలియజేశాడు. 

ఫ్లాష్ బ్యాక్ లో శర్వానంద్ యువకుడిగా కనిపిస్తాడు. అతడు ఎలా గ్యాంగ్ స్టర్ గా మారాడనేదే ఈ చిత్ర కథ. కొంత మందికి అతడు క్రిమినల్.. మిగిలిన వారికి అతడు హీరో అనే లైన్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కోపాన్ని, దాహాన్ని ఇంకొకడు శాసించే స్థితిలో మనం ఉండకూడదు అని శర్వానంద్ టీజర్ చివర్లో వినిపించే డైలాగ్ హైలైట్ గా నిలుస్తోంది. 

ఆగష్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.