శర్వానంద్ హీరోగా వస్తోన్న రాధా మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేసేందుకు సన్నాహాలు శర్వానంద్ సరసన హీరోయిన్లుగా లావణ్య త్రిపాఠి, అక్ష పర్ దేశాని
రన్ రాజా రన్, మళ్లి మళ్లి ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానంభవతి లాంటి వరుస విజయాలతో దూసుకెళ్తున్న శర్వానంద్ నటించిన తాజా చిత్రం రాధా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బేనర్ లో ప్రముఖ నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర నిర్మాత భోగవల్లి బాపినీడు మాట్లాడుతూ ఈ చిత్రం వినోదాత్మకంగా సాగుతూ అందర్నీ అలరిస్తుందని అన్నారు.
వేసవిలో వస్తున్న రాధా చిత్రాన్ని మే 12న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రం రిలీజ్ కు ముందు మే6న విజయవాడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. అంతకు ముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు కూడా మంచి స్పందన లభించింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను బట్టే ఈ చిత్రానికి సంబంధించిన ప్రేక్షకులతో కలిసి వేడుక జరపాలని నిర్ణయించారు.
శర్వానంద్ సరసన హీరోయిన్లుగా లావణ్య త్రిపాఠి, అక్ష పర్ దేశాని నటిస్తున్న ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉండనుంది.

