Asianet News TeluguAsianet News Telugu

Sharwanand:'బింబిసార' కి శర్వా సినిమాకు పోలిక, అదే కలిసి వస్తోంది

'ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి మీరు ఆశ్చర్యపోవచ్చు.. అసలు నమ్మకపోవచ్చు కూడా.. కానీ మీరు ఇది నమ్మే తీరాలి..' అంటూ నాజర్ చెప్పే డైలాగ్స్ తో టీజర్ మొదలైంది. ముగ్గురు స్నేహితులైన శర్వానంద్‌, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ఫ్యూచర్ నుంచి ప్రెజంట్ లోకి రావడం కథపై ఆసక్తిని క్రియేట్ చేసింది. 

Sharwanand Oke Oka Jeevitham Releasing On Sep 9th
Author
Hyderabad, First Published Aug 10, 2022, 9:06 AM IST


రీసెంట్ గా వచ్చిన బింబిసార చిత్రం టైమ్ ట్రావెల్ నేపధ్యంలో వచ్చి సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మరో చిత్రం టైమ్ ట్రావెల్ కు రెడీ అవుతోంది. అది మరేదో కాదు...ఒకే ఒక జీవితం. శర్వానంద్ హీరోగా చేసిన ఈ చిత్రంకు బింబిసార హిట్ కావటంతో ఊపు వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో  గత కొంతకాలంగా విఎఫ్ ఎక్స్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి  ఇప్పుడు రిలీజ్ డేట్ ఇచ్చారు. 

 శర్వానంద్ కు ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేదు. వచ్చిన సినిమా వచ్చినట్లే వెళ్లిపోతోంది. మినిమం కలెక్షన్స్, ఓపినింగ్స్ రప్పించలేకపోతోంది. ఈ క్రమంలో టైమ్ ట్రావెల్ నేపధ్యంలో శర్వా ఓ చిత్రం చేసారు.  కెరీర్‌‏లో 30వ సినిమాగా రూపొందుతోన్న చిత్రం 'ఒకే ఒక జీవితం'. ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నారు.

 ఈ సినిమాకి తరుణ్ భాస్కర్‌ డైలాగ్స్ రాశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  టీజర్ ను బట్టి ఇదొక సైంటిఫిక్ డ్రామా అని తెలుస్తోంది. టైమ్‌ మెషీన్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. 'ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి మీరు ఆశ్చర్యపోవచ్చు.. అసలు నమ్మకపోవచ్చు కూడా.. కానీ మీరు ఇది నమ్మే తీరాలి..' అంటూ నాజర్ చెప్పే డైలాగ్స్ తో టీజర్ మొదలైంది. ముగ్గురు స్నేహితులైన శర్వానంద్‌, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ఫ్యూచర్ నుంచి ప్రెజంట్ లోకి రావడం కథపై ఆసక్తిని క్రియేట్ చేసింది. సినిమాలో తల్లీకొడుకుల సెంటిమెంట్ కూడా బాగానే ఉన్నట్లు ఉంది.  
 
జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్‌లు ఈ సినిమాకి పని చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios