Asianet News TeluguAsianet News Telugu

వివాదంలో శర్వానంద్‌ కొత్త సినిమా?.. రచ్చ చేస్తున్న `సామజవరగమన` నిర్మాతలు ? కారణమిదే..

ఇటీవల పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు శర్వానంద్‌. అప్పట్నుంచి ఆయన బయటకు రాలేదు. తాజాగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన కొత్త సినిమా వివాదాల్లో ఇరుక్కోవడమే అందుకు కారణమట.

sharwanand new movie goes controversy samajavaragamana producers create issue ? arj
Author
First Published Oct 28, 2023, 6:35 PM IST | Last Updated Oct 28, 2023, 6:39 PM IST

శర్వానంద్‌(Sharwanand)ని వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. `మహానుభావుడు` తర్వాత ఆయనకు ఒక్క హిట్‌ కూడా లేదు. ఆరేళ్లలో ఏడు సినిమాలు చేశాడు. అవన్నీ పరాజయం చెందాయి. దీంతో శర్వానంద్‌ కెరీర్‌ దైలమాలో పడింది. ఓ రకంగా ఒడిదుడుకులతో సాగుతుందని తెలుస్తుంది. హిట్‌ కోసం ఆరేళ్లుగా వెయిట్‌ చేస్తూనే ఉన్నాడు శర్వా. ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రాలు కూడా డిజప్పాయింట్‌ చేస్తున్నాయి. 

గతేడాది `ఆడాళ్లు మీకు జోహార్లు` చిత్రంతో వచ్చారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం సైతం మెప్పించలేకపోయింది. ఇప్పుడు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్లు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా శర్వానంద్‌ వార్తల్లో నిలిచారు. తన కొత్త సినిమా వివాదంలో ఇరుక్కుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

శర్వానంద్‌.. `సామజవరగమన` చిత్రంతో సక్సెస్‌ కొట్టిన రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు. ఈ కథ మొదట నాగచైతన్య వద్దకు వెళ్లింది. కానీ ఆయన రిజక్ట్ చేశాడు. సినిమాలో విడాకుల పాయింట్‌ ఉండటంతో చైతూ నో చెప్పాడని సమాచారం. దీంతో అదే కథని శర్వానంద్‌కి చెప్పాడు రామ్‌ అబ్బరాజు. ఇందులో ఉన్న కామెడీకి ఎగ్జైట్‌ అయిన శర్వానంద్‌ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మించబోతున్నారు. 

ఈ విషయం తెలిసి `సామజవరగమన` నిర్మాతలు వివాదం చేస్తున్నారట. `సామజవరగమన` సినిమా తర్వాత రెండో చిత్రం కూడా తమ బ్యానర్‌లోనే చేయాలని దర్శకుడు రామ్‌ అబ్బరాజుతో అగ్రిమెంట్‌ చేసుకున్నారట నిర్మాతలు అనిల్‌ సుంకర, రాజేష్‌ దండా. ఆ సినిమాని అనిల్‌ సుంకర సమర్పణలో హాస్య మూవీస్‌ పతాకంపై రాజేష్‌ దండా నిర్మించిన విషయం తెలిసిందే. `సామజవరగమన` పెద్ద హిట్‌ అయ్యింది. యాభై కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి శ్రీవిష్ణు కి హిట్‌ ఇచ్చి గట్టేక్కించింది. దీంతో శర్వానంద్‌ కూడా గట్టేక్కేందుకు రామ్‌ అబ్బరాజుని నమ్ముకున్నారట. 

ప్రస్తుతం శర్వానంద్‌ నటిస్తున్న శ్రీరామ్‌ ఆదిత్య మూవీపై పెద్దగా హోప్స్ లేవని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రామ్‌ అబ్బరాజు సినిమాపైనే శర్వా ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకున్నారట. కానీ ఇప్పుడు దర్శకుడు రామ్‌ అబ్బరాజు తమ అగ్రిమెంట్‌ని బ్రేక్‌ చేసి మైత్రీ మూవీ మేకర్స్ లో సినిమా చేయడం పట్ల నిర్మాతలు అనిల్‌ సుంకర, రాజేష్‌ దండా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. దీంతో ఈ ప్రాజెక్ట్ వివాదంగా మారిందని ఫిల్మ్ నగర్‌ టాక్‌. అయితే దీనికి సంబధించి నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios