Asianet News TeluguAsianet News Telugu

శర్వా లీగల్ నోటీసు...నిర్మాత వెర్షన్ ఇదీ!

 సినిమా కోసం శర్వా 6 కోట్ల రెమ్మూనరేషన్‌తో పాటుగా 50శాతం లాభాన్ని తీసుకునేలా నిర్మాతలతో అగ్రిమెంట్‌ చేసుకున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే నాలుగు కోట్లు తీసుకున్నా శర్వా.. ఆ సినిమా రిలీజ్‌ తర్వాత నిర్మాతలు ఇస్తామన్న రెండు కోట్ల చెక్కు తాజాగా బౌన్స్‌ అవడంతో.. వారి మీద సీరియస్ అయ్యారు. 

Sharwanand legal case...producers different version jsp
Author
Hyderabad, First Published May 30, 2021, 4:40 PM IST

హిట్టుకోసం తహతహలాడుతున్న హీరోలలో ఒకరు శర్వానంద్. 2017లో శతమానం భవతి, మహానుభావుడు తర్వాత మళ్లీ అలాంటి హిట్ ఈ హీరో ఖాతాలో పడలేదు. పడిపడిలేచే మనసు చాలా ఎక్సపెక్టేషన్స్ తో రిలీజై డిజాస్టర్ అయ్యింది. సేమ్ టు సేమ్ రణరంగం, జానూ సినిమాలు.  రణరంగం, జానూ సినిమాలు వచ్చాక పడిపడిలేచే మనసు ఫరవాలేదు అన్నారు. ఆ తర్వాత మళ్లీ శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్. కానీ ఆ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. సోసో సినిమా అనిపించుకుంది. అయితే ఈ సినిమా నిమిత్తం తనకు పేమెంట్ సరిగ్గా అందలేదని నిర్మాతలు 14 రీల్స్ వారికి శర్వానంద్ నోటీసులు పంపారని సమాచారం. 

 ఈ సినిమా కోసం శర్వా 6 కోట్ల రెమ్మూనరేషన్‌తో పాటుగా 50శాతం లాభాన్ని తీసుకునేలా నిర్మాతలతో అగ్రిమెంట్‌ చేసుకున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే నాలుగు కోట్లు తీసుకున్నా శర్వా.. ఆ సినిమా రిలీజ్‌ తర్వాత నిర్మాతలు ఇస్తామన్న రెండు కోట్ల చెక్కు తాజాగా బౌన్స్‌ అవడంతో.. వారి మీద సీరియస్ అయ్యారు. పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చారని ఆరోపిస్తూ.. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్‌ కౌన్సిల్కి ఫిర్మాదు చేశారు. దాంతో పాటుగా వారికి లీగల్ నోటీసులు పంపించారు. ఇదీ శర్వా వైపు వెర్షన్. అయితే నిర్మాతల వెర్షన్ వేరే ఉందని తెలుస్తోంది.

ఇన్నేళ్లుగా తమ సంస్ద ఎప్పుడూ ఇలాంటి వివాదంలో ఇరుక్కోలేదు. నాని, వరుణ్ తేజ్, హరీష్ శంకర్ ఇలా అందరికి సినిమా రిలీజ్ తర్వాత సెటిల్ చేసాం. ఇప్పటికి వారంతా మా సంస్దతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. శ్రీకారం ఏప్రియల్ 2020లో రిలీజ్ అనున్నాం. దాంతో పైనల్ షెడ్యూల్ పిబ్రవరి 2020లో ప్లాన్ చేసాం. అయితే జాను ఫ్లాప్ తర్వాత అతను యుఎస్ వెళ్లారు. ఆ తర్వాత షూటింగ్ ఫినిష్ చేద్దామంటే కరోనా లాక్ డౌన్ వచ్చింది. డిసెంబర్ 2020నాటికి నాలుగున్న కోట్లు ఇవ్వటం జరిగింది. మార్చి 2021లో సిననిమా రిలీజ్ చేసాం. యుఎస్ ప్రీ రిలీజ్ బిజినెస్ అసలు లేదు. అలాగే కర్ణాటక,తమిళ మార్కెట్ కూడా లేదు. దాంతో డెఫిషిట్ లో రిలీజ్ చేసాం మూవీని. 

అప్పటికి నిర్మాతలు సెకండ్ వేవ్ సమస్యతో ఇప్పటికిప్పుడు ఫైనల్ సెటిల్మెంట్ చేయలేమని చెప్పాం. మార్కెట్లో మనీ రొటీషన్ లేదు. కానీ శర్వానంద్ పోస్ట్ డేటెడ్ చెక్కులను నిర్మాత మాట లెక్క చేయకుండా ,వారిని బ్లేమ్ చేయటానికే బ్యాంక్ లో డిపాజిట్ చేసారు.

అయితే శర్వానంద్ మాత్రం తనను షూటింగ్ టైమ్ లో సరిగ్గా ట్రీట్ చేయలేదని ఫీల్ అయ్యారని అంటున్నారని సమాచారం. దానికి నిర్మాతలు మరో వెర్షన్ చెప్తున్నారు. తాము శర్వాని ఇబ్బంది పెట్టకూడదని, అతను మహాసముద్రం షూటింగ్ నిమిత్తం వైజాగ్ లో అక్కడే ఓ డబ్బింగ్ ల్యాబ్ ని టెంపరరీ గా ఎంరేజ్ చేసామన్నారు. అలాగే జాను ఫ్లాఫ్ తర్వాత యుఎస్ వెళ్తే వచ్చేదాకా వెయిట్ చేసామని చెప్పుకొచ్చారు.
 
 ఇక మొదటి నుంచి శర్వానంద్...ఎందుకో ఈ సినిమాపట్ల అంత ఉత్సాహంగా లేడని వార్తలు వినిపించాయి. ఆ టాక్ కు  తగ్గట్లుగానే సినిమా నీరసంగా థియోటర్స్ నుంచి వెనుతిరిగింది.  అయితే ఈ మధ్యే సన్ ఎన్ఎక్స్టీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో ఈ సినిమా  స్ట్రీమింగ్ అయ్యింది. విచిత్రంగా ఈ సినిమా ఓటీటీలో రికార్డ్స్ క్రియేట్ చేస్తోందని సమాచారం.

సన్ ఎన్ఎక్స్ టి లో తక్కువ సమయంలో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా శర్వా 'శ్రీకారం' నిలిచింది. ఓటీటీలో ఐదు వేర్వేరు భాషల కంటెంట్ కావల్సినంత అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిలో 'శ్రీకారం' సినిమా మిలియన్ల వ్యూస్ సంపాదించి మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సూపర్ హిట్ గా నిలవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  వ్యవసాయం ప్రాధాన్యతను తెలియజేస్తున్న సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. కొత్త దర్శకుడు బి. కిషోర్ రెడ్డి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

'శ్రీకారం' చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట - గోపీ ఆచంట కలసి నిర్మించారు. ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చగా.. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాసారు. సీనియర్ నరేష్ - సాయికుమార్ - మురళీ శర్మ - రావు రమేష్ - ఆమని - సత్య - సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios