టాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు శర్వానంద్. మాస్.. క్లాస్ అన్ని ట్రై చేసిన యంగ్ హీరో.. ఈసారి ఆడావాళ్ళు మీకు జోహార్లు అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో రాబోతున్నాడు.
టాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు శర్వానంద్. మాస్.. క్లాస్ అన్ని ట్రై చేసిన యంగ్ హీరో.. ఈసారి ఆడావాళ్ళు మీకు జోహార్లు అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో రాబోతున్నాడు.
థియేటర్లోనుంచి మంచి మంచి సినిమా చూశాం అన్న అనుభూతితో బయటకు వస్తారు అంటున్నాడు శర్వానంద్. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నవ్వులు పంచే సినిమా అంటున్నాడు శర్వ. శతమానం భవతి, మహానుభావుడు లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, సినిమాలతో అలరించిన యంగ్ స్టార్.. ఆతరువాత వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. అయినా తగ్గేదేలే అంటూ.. సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.
కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మికా మందన్న జంటగా నటించిన సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు. సీనియర్ హీరోయిన్లు రాధిక, ఖుష్బు,ఊర్వశీ లు లీడ్ రోల్స్ లో కనిపించిన ఈసినిమా ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మీడియా మీట్ నిర్వహించారు మేకర్స్.
తననుంచి ఆడియన్స్ ఏ కోరుకుంటున్నారో.. ఈ సినిమా ద్వారా అది అందుతుంది అన్నారు శర్వానంద్. ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా చూసిన ప్రేక్షకులు చిరునవ్వుతో, మంచి సినిమా చూశాం అనే అనుభూతితో బయటికొస్తారు. ఈ సినిమాలో రాధిక, ఖుష్బూగార్లతో నటించడం ఆనందంగా ఉంది అని శర్వానంద్ అన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ కిశోర్ తిరుమల మాట్లాడుతూ.. ఈ సినిమా అనుకున్నంత బాగా రావడానికి కారణమైన శర్వానంద్, రష్మిక, ఖుష్బూ, రాధికగార్లకు ధన్యవాదాలు అన్నారు. ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా చేసిన సినిమా ఇది...ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారన్నారు. ఇక హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ...ప్రేక్షకులను చివరి వరకూ నవ్వించే చిత్రమిది అన్నారు.
అంతే కాదు...కరోనా తర్వాత కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు అన్నారు నటి రాధికా శరత్‌కుమార్. ఖుష్బు మాట్లాడుతూ.. కుటుంబ విలువలు, బంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది అన్నారు. నిర్మాత సుధాకర్, నటీమణులు ఝాన్సీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
