యువ హీరో శర్వానంద్ ఇటీవల రణరంగం ఫస్ట్ లుక్ తో ఒక్కసారిగా ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక అల్ట్రా మాస్ లుక్ లో మెరిసిన శర్వా కెరీర్ లో మొదటిసారి గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. 

అసలు విషయంలోకి వస్తే.. రణరంగం సినిమా తరువాత శర్వానంద్ ఎలాంటి సినిమాతో రాబోతున్నాడు అనే దానిపై ఇంకా క్లారిటి రాలేదు. ప్రస్తుతం చాలా కథలు శర్వా దగ్గరకు వస్తున్నప్పటికీ ఇంకా దేనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ఓ దర్శకుడి కథపై మాత్రం ఈ హీరో కన్ను పడినట్లు తెలుస్తోంది. గత ఏడాది నాని - నాగార్జున తో దేవ దాస్ అనే మల్టీస్టారర్ సినిమాకు దర్శకత్వం వహించి ప్లాప్ అందుకున్న శ్రీరామ్ ఆదిత్య రీసెంట్ శర్వానంద్ ని కలిసినట్లు సమాచారం.

స్క్రీన్ లో ప్లే లో కొన్ని పాయింట్స్ చెప్పి మెప్పించిన దర్శకుడు ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ ని డిజైన్ చేస్తున్నట్లు టాక్. సస్పెన్స్ థ్రిల్లర్ తో ఆ కతనుఆ అల్లినట్లు టాక్. కుదిరితే రణరంగం సినిమా పూర్తయ్యాక ఈ శ్రీరామ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని ఈ హీరో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.