బాలీవుడ్ లో ఒకప్పుడు వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ తో ఒక ట్రెండ్ సెట్ చేసిన షారుక్ ఖాన్ ఇప్పుడు పూర్తిగా డౌన్ అయ్యాడు. మెయిన్ గా జీరో సినిమా ఆయన కెరీర్ కి గట్టి దెబ్బె వేసింది. అయితే కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి పర్సనల్ లైఫ్ తో ఎంజాయ్ చేయాలనీ షారుక్ డిసైడ్ అయ్యాడు. 

అలాగే ఐపీఎల్ లో తన టీమ్ కేకేఆర్ మ్యాచ్ లకు వెళుతూ అభిమానుల దృష్టిలో పడుతున్నాడు. అసలు విషయంలోకి వస్తే ఇటీవల షారుక్ ఒక తమిళ్ సినిమా కథను రీమేక్ల్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. విజయ్ - అట్లీ కాంబినేషన్ లో వచ్చిన మెర్సల్ కథను హిందీలో షారుక్ చేయబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. 

అదే విధంగా ఒరిజినల్ దర్శకుడు అట్లీ షారుక్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు టాక్ రాగా.. ఈ రూమర్స్ కి షారుక్ టీమ్ ఎండ్ కార్డ్ పెట్టేసింది. మెర్సల్ సినిమా గురించి షారుక్ తో ఎవరు చర్చించలేదని అధికారికంగా మీడియాకు వివరణ ఇచ్చారు.. దీంతో షారుక్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడు అనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.