సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా ఒక సినిమా విడుదలైన మొదటి రోజే డివైడ్ టాక్ తెచ్చుకుంటే సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడకూడదని చిత్ర యూనిట్ వేసే ప్లాన్స్ అన్ని ఇన్ని కావు. కొంతైనా కలెక్షన్స్ పెరుగుతాయని ఎదో ఒక విధంగా ప్రమోషన్స్ చేస్తుంటారు. అదే విధంగా థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ టీమ్ కూడా కష్టపడుతోంది. 

మొదటి రోజు 50 కోట్లు కొల్లగొట్టడం అదే విధంగఫా ఫస్ట్ వీక్ లో 100కోట్లను దాటేసిందని పోస్టర్స్ తో బజ్ క్రియేట్ చేస్తున్నారు. సినిమా ఏ విధంగా ఆకట్టుకోలేకపోయిందని ఇప్పటికే టాక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే సెలబ్రెటీలు ఎవరు స్పందించని విధంగా షారుక్ ఖాన్ సినిమా రిజల్ట్ పై కామెంట్ చేశాడు. 

రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన షారుక్ అమిర్ ఖాన్ - అమితాబ్స్ నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమా ప్లాప్ అవ్వడం నిజంగా బాధాకరమని అన్నారు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ కి ఈ స్టార్ నటులు ఎంతో సేవ చేస్తున్నారని చెబుతూ.. సినిమా ప్లాప్ అయినంత మాత్రాన వారిని తక్కువచేయలేమని చెప్పాడు. 

ఇక సినిమా అయితే తనకు బాగా నచ్చిందని ఇలాంటి సినిమా ఇంతవరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రాలేదని అన్నారు. ఇక గతంలో రావణ్ సినిమా చేసినప్పుడు తనకు కూడా ఇలాంటి ఓటమే ఎదురయ్యిందని చెప్పిన షారుక్ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపిస్తూనే ఫ్లాప్ అనడంతో అది కాస్త బి టౌన్ లో ఇప్పుడు వైరల్ మారింది.