సక్సెస్ అందితే సినీ ఇండస్ట్రీలో దక్కే మర్యాదలే వేరు. విజయంలో ప్రధాన పాత్ర పోషించే దర్శకుడి  కంటే కూడా హీరోకు ఎక్కువ క్రేజ్ దక్కుతుంది. అదే ఒక సినిమా డిజాస్టర్ అయితే హీరోకి అయ్యే డ్యామేజ్ కంటే కూడా దర్శకుడిపై ఆప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. 

ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక ఒక సీనియర్ దర్శకుడి పరిస్థితి కూడా ఇప్పుడు అలానే మారింది. షారుక్ ఖాన్ కి మొన్నటివరకు క్లోజ్ గా ఉన్న ఆనంద్ కుమార్ ఎల్ రాయ్ ఇప్పుడు అల్లంలా మారాడు. ఎవరు దగ్గరికి కూడా రానివ్వడం లేదట., అందుకు కారణం షారుక్ తో చేసిన జీరో సినిమా డిజాస్టర్ అవ్వడం. 

త ఏడాది చివరలో వచ్చిన ఆ సినిమాలో షారుక్ మరగుజ్జు పాత్రలో కనిపించాడు. మొదటి షోకే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఖర్చు చేసిన బడ్జెట్ లో సగం కూడా ఆ సినిమా వెనక్కి తీసుకురాలేకపోయింది. 

షారుక్ కెరీర్ కు ఇది మరచిపోలేని దెబ్బ. అయితే జీరో కంటే ముందు ఆనంద్ షారుక్ తో మరో ప్రాజెక్ట్ ను అనుకున్నప్పటికీ  ఆ సినిమా కనీసం చర్చల్లోకి కూడా రాలేదు. పైగా ఇటీవల షారుక్ పాల్గొన్న ప్రెస్ మీట్ లో దర్శకుడికి ఇన్ డైరక్ట్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఒక  రిపోర్ట్రర్ ఆనంద్ గురించి ఒక ప్రశ్న వేయగా దాన్ని లెక్కచేయకుండా టాపిక్ ను డైవర్ట్ చేశాడు. అలాగే షారుక్ కళ్లలో ఆగ్రహం కూడా కనిపించింది. రీసెంట్ దర్శకుడు ఆనంద్ కలవడానికి ట్రై చేయగా షారుక్ మొహం మీదే తనకు ఇష్టం లేదని చెప్పినట్లు బాలీవుడ్ లో టాక్ వస్తోంది.