Asianet News TeluguAsianet News Telugu

‘8ఏళ్ల బ్రేకప్ తర్వాత మళ్లీ లవ్ లో పడ్డాం..’ ‘గుంటూరు కారం’ నటుడి భార్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

ప్రేమ.. పెళ్లి.. మధ్యలో 8 ఎనిదేళ్ల బ్రేకప్.. ఇలాగే తమిళ నటుడు శాంతను భాగ్యరాజ్ - కికీ విజయ్ జీవితంలో జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వారిద్దరూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 
 

Shanthanu Bhagyaraj wife Kiki Vijay comments about Their break upNSK
Author
First Published Sep 18, 2023, 7:47 PM IST


తమిళ నటుడు శాంతను భాగ్యరాజ్ (Shanthanu Bhagyaraj)  ప్రస్తుతం తెలుగులో మహేశ్ బాబు ‘గుంటూరు కారం’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ లో వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. డైరెక్టర్, నటుడు, భాగ్యరాజ్ కొడుకుగా  శాంతను భాగ్యరాజ్ కోలీవుడ్ లో అడుగుపెట్టారు. సక్కరకత్తి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా ‘రావణ కొట్టం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గతంలో ‘మాస్టర్’ చిత్రంలోనూ భార్గవ్ అనే పాత్రలో కినిపంచారు. ప్రస్తుతం బ్లూస్టార్ అనే మరో సినిమా చేస్తున్నారు. 

అయితే, రీసెంట్ గా శాంతను భాగ్యరాజ్, అతని భార్య కికీ విజయ్ తో కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ ప్రేమ, బ్రేకప్ వంటి అంశాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2015లోనే వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం వీరిద్దరికి విత్ లవ్ శాంతను కికీ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. వారి వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. 

ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ముందు తమ బ్రేకప్ పై శాంతను మాట్లాడారు. ‘మేం ప్రేమించుకున్నాం. ఆ తర్వాత బ్రేకప్ అయ్యింది. దాంతో ఎనిమిదేళ్లు దూరంగా ఉన్నాం. ఓ సందర్భంలో మళ్లీ లవ్ లో పడ్డాం. గతంలో చిన్నచిన్న విషయాలకే బాగా గొడవపడే వాళ్లం’ అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. 

ఇక ఆయన భార్య కికీ మాట్లాడుతూ  ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.. ‘నేను శాంతను బాగా ప్రేమించాను. ఆయనతో లవ్ లో ఉన్నప్పుడు ఓ ఘటన జరిగింది. ఇప్పటికీ బాగా గుర్తుంది. శాంతను వేరే అమ్మాయితో కాఫీ షాప్ లో ఉన్నాడని నా ఫ్రెండ్ ఒకరు చూసి కాల్ చేశారు. నేను వెంటనే ఆయనకి ఫోన్ చేసి ఎక్కడున్నారని అడిగాను. కానీ ఆయన మా నాన్న తో ఉన్నానని అబద్ధం చెప్పాడు. ఇలాంటి ఘటనలతో చిన్నచిన్న గొడవలై పెద్దవిగా మారాయి. దాంతో బ్రేకప్ చెప్పుకున్నాం. ఎనిమిదేళ్లు విడిపోయాం. కానీ ఓ షోలో ఇద్దరం కలిసి డాన్స్ చేయాల్సి రావడంతో మళ్లీ ఒక్కటయ్యాం’. అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీరు దాపత్యం జీవితం సజావుగా సాగుతోంది. కాగా బ్రేకప్ అయిన ఎనిమిదేళ్లకు మళ్లీ లవ్ లో పెళ్లి కూడా చేసుకోవడం చాలా ఆసక్తికరంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios