BiggBoss Telugu 5: బిగ్‌బాస్ ద్వారా విన్నర్ సన్నీ కంటే షణ్ముఖ్ సంపాదించిందే ఎక్కువా?
తాజాగా తెలుస్తున్న లెక్కల ప్రకారం..రన్నరప్ షణ్ముఖ్ కే ఎక్కువ దక్కిందట. ఆయన పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. విన్నర్ సన్నీ కంటే షణ్ముఖే అత్యధికంగా పారితోషికం అందుకున్నారని అంటున్నారు.
బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ విన్నర్‌గా వీజే సన్నీ నిలిచారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలేలో విజేత నిర్ణయించే టాస్క్ లో నాగార్జున అందరిని ఉత్కంఠకి గురి చేశారు. సస్పెన్స్ ని లాగి లాగి విన్నర్ ని అనౌన్స్ చేశారు. ముందుగా ఈ సారి స్పెషల్ ఉందని, హౌజ్‌లోనే బిగ్‌బాస్ విన్నర్ తేలిపోతుందని తెలిపారు నాగ్. అందుకోసం `జాతిరత్నాలు` ఫేమ్ ఫరియా అబ్దుల్లాని లోపలికి పంపించి ఓ గేమ్ పెట్టారు. తీరా ఆ గేమ్ తూచ్ అనిపించింది. ఎప్పటిలాగే నాగ్ హౌజ్‌లోకి వెళ్లి టాప్ 2 కంటెస్టెంట్లు సన్నీ,షణ్ముఖ్‌లను గౌరవంగా తీసుకొచ్చాడు.
స్టేజ్‌పైనే అనౌన్స్ చేశాడు. సన్నీని విజేతగా ప్రకటించాడు. దీంతో షణ్ముఖ్ రన్నరప్‌గా నిలిచారు. తాను విజేత కావడంతో సన్నీ ఎగిరి గంతేశాడు. నాగ్‌ని ఎత్తుకుని మరీ ముద్దు పెట్టారు. ఎంతో సందడిగా సాగిన ఈఈవెంట్‌తో బిగ్‌బాస్ 5 ముగిసింది. సన్నీ విజేతగా నిలవడంతో ఆయనకు యాభై లక్షల ప్రైజ్ మనీ, ట్రోఫీతోపాటు ఓ బైక్, మూడు వందల గజాల స్థలం దక్కింది. ఈ లెక్కన సన్నీకి బాగానే అందిందని చెప్పొచ్చు.
కానీ తాజాగా తెలుస్తున్న లెక్కల ప్రకారం..రన్నరప్ షణ్ముఖ్ కే ఎక్కువ దక్కిందట. ఆయన పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. యాంకర్ రవి తర్వాత ఎక్కువ పారితోషికం అందుకున్న కంటెస్టెంట్‌గా షణ్ముఖ్ నిలిచాడట. అతనికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని షో నిర్వాహకులు ఒక్క వారానికి గాను నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ముట్టజెప్పారట. మొత్తంగా పదిహేను వారాలకుగానూ షణ్ముఖ్ రూ.65 లక్షల పైనే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది విన్నర్ ప్రైజ్‌మనీ కన్నా కూడా ఎక్కువే అని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే విన్నర్ సన్నీపై షణ్ముఖ్ టీమ్ ఫైర్ అవుతున్నారు. ఆయన్ని సోషల్ మీడియా వేదికపై ట్రోల్స్ చేస్తున్నారు. సన్నీ కంటే షణ్ముఖ్‌కే ఎక్కువ ఓట్లు పడ్డాయని, కానీ సన్నీని విన్నర్ గా నిలిపారని ఆరోపిస్తున్నారు. హౌజ్‌లో గ్రూపులు క్రియేట్ చేసి సన్నీ గెలిచారని అంటున్నారు. ఇలా వరుసగా సన్నీ.. షణ్ముఖ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడని చెప్పొచ్చు.